ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ చినాబ్ రైల్వే వంతెన ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ సొంతం. అలాంటి రైల్వే వంతెనను ప్రధాని మోడీ శుక్రవారం జాతికి అంకింతం చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఎట్టకేలకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారిక నివాసాన్ని కేటాయించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అనంతరం రేఖా గుప్తాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు జార్ఖండ్లో పర్యటించనున్నారు. జూన్ 10, 11 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధాన కార్యదర్శి అల్కా తివారీ తెలిపారు.
ఈఎంఐ చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. వరుసగా మూడోసారి రెపోరేటును తగ్గించింది. 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ కీలక ప్రకటన చేసింది.
బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడే బీఎస్పీకి మంచిరోజులు వస్తాయని ఆ పార్టీ అధినేత మాయావతి వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVMలు) బదులుగా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ప్రయత్నించినా సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రాముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. యుద్ధాన్ని ఆపేందుకు ఇరు దేశాధినేతలతో చర్చించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అమెరికా విసుగెత్తిపోయింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. గత కొంత కాలంగా ట్రంప్ ప్రభుత్వంపై మస్క్ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ప్రధాని మోడీ శుక్రవారం జమ్ముూకాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈరోజు ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెనను మోడీ ప్రారంభించనున్నారు. రూ.46,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. పట్టపగలే మనుషులపైకి తెగబడింది. రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఒక వ్యక్తిపైకి అమాంతంగా దాడి చేసి ఈడ్చుకుపోయింది. దీంతో దానితో పోరాడలేక కిందపడిపోయాడు. అనంతరం దాడి చేస్తూనే ఉంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ గురువారం తన నివాసంలో ‘సిందూర’ మొక్కను నాటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహిళా శౌర్యం, ప్రేరణకు బలమైన చిహ్నంగా సిందూర మొక్క నిలుస్తుందని మోడీ పేర్కొన్నారు.