బాలీవుడ్ నటులపై మత సంబంధమైన వ్యాఖ్యలు చేయడంతో పుణెకు చెందిన లా విద్యార్థిని శర్మిష్ట పనోలిని పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురుగ్రామ్‌లో పనోలిని అరెస్ట్ చేసి కోల్‌కతాకు తరలించారు. అక్కడ స్థానిక కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. దీంతో ఆమెను జైలుకు తరలించారు.
ఇది కూాడా చదవండి: Allagadda: ఎమ్మెల్యే అనుచరుల వీరంగం.. మహిళ కిడ్నాప్‌నకు యత్నం..
అయితే తనకు బెయిల్ ఇవ్వాలంటూ శర్మిష్ట పనోలి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అందుకు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి పార్థ సారథిని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. బెయిల్ ఇవ్వకపోతే న్యాయమూర్తిని చంపేస్తామంటూ నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా హెచ్చరిస్తున్నారు. కొందరు న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు చేయగా.. ఇంకొందరు న్యాయమూర్తికి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారు. మరికొందరు బెయిల్ ఇవ్వకపోతే కచ్చితంగా చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. జడ్జి అడ్రస్.. మొబైల్ నెంబర్లు ఇవ్వాలంటూ ఇంకొందరు పోస్టులు పెట్టారు. ప్రస్తుతం వీటిపై పోలీసులు దృష్టి పెట్టారు.
ఇది కూాడా చదవండి: Vicky Koushal : మరో బయోపిక్‌ల్లో విక్కీ కౌశల్..
ఆపరేషన్ సిందూర్‌పై బాలీవుడ్ నటులు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ శర్మిష్ట పనోలి ఒక మతాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పశ్చిమ బెంగాల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు ఆమె కోసం పూణెకు వచ్చారు. ఇంట్లో కుటుంబ సభ్యులు కనిపించలేదు. అనంతరం కోల్‌కతా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో మరోసారి పోలీసులు జల్లెడ పట్టగా గురుగ్రామ్‌లో పనోలిని అదుపులోకి తీసుకుని కోల్‌కతా కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
అయితే సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వైరల్ కావడంతో అప్పటికే శర్మిష్ట క్షమాపణ చెప్పి.. డిలీట్ చేసింది. కానీ అప్పటికే ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడంతో కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే శర్మిష్ట అరెస్ట్‌పై బీజేపీ, దాని మిత్ర పక్షాలు తీవ్రంగా ఖండించాయి. శర్మిష్టను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.