ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు సంచలన విషయాలు సేకరించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోనమ్‌కు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీతో మే 11న వివాహం జరిగింది.
ప్రధాని మోడీ ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ఈఫిల్ టవర్ కంటే పెద్దది. ఈ వంతెనను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. అయితే ఈ వంతెన ఇప్పుడు విమాన ప్రయాణికులకు టూరిస్ట్ ప్లేస్‌గా మారింది.
అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అయితే ట్రంప్ వలస వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ లాస్ ఏంజిల్‌లో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. అయితే బలగాలు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
అమెరికా పోలీసులు అమానుషానికి పాల్పడ్డారు. ఒక భారతీయ విద్యార్థి పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. న్యూజెర్సీలోని న్యూవార్క్ విమానాశ్రయంలో ఒక భారతీయ విద్యార్థి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు.
రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. సోమవారం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ పోలీసులకు పట్టుబడింది. అనంతరం ఆమెను యూపీ పోలీసులు విచారించారు.
భర్త రాజా రఘువంశీని ప్రియుడు రాజ్ కుష్వాహా సహకారంతో సోనమ్ చంపేసిందని పోలీసులు వెల్లడించారు. మే 11న రాజా రఘువంశీ-సోనమ్‌కి వివాహం జరిగింది. మే 20న మేఘాలయ హనీమూన్‌కు వెళ్లి మే 23న అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం లభ్యం అయింది.
ప్రధాని మోడీ 11 ఏళ్లలో దేశ ముఖ చిత్రాన్ని మార్చేశారని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. జూన్ 9 నాటికి మోడీ ప్రభుత్వం వచ్చి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు.
లాస్ ఏంజిల్‌లో అక్రమవలసలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అక్రమవలసదారుల్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే హఠాత్తుగా పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి.
రాజా రఘువంశీ-సోనమ్‌కు మే 11న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వివాహం జరిగిందని.. ఆ సమయంలో అంతా సాధారణంగానే ఉందని రాజా సోదరుడు సచిన్ తెలిపారు. పెళ్లికి ముందు కూడా సోనమ్ కుటుంబంతో కలిసే షాపింగ్ చేసినట్లు వెల్లడించారు.