Chenab Bridge: విమాన ప్రయాణికులకు ప్రత్యేక ఆకర్షణగా చినాబ్ బ్రిడ్జి.. పైలట్లు ఏం చేస్తున్నారంటే..!
- విమాన ప్రయాణికులకు ప్రత్యేక ఆకర్షణగా చినాబ్ బ్రిడ్జి
- ప్రత్యేక ప్రకటన చేస్తున్న పైలట్లు
- మొబైల్‌లో బంధిస్తున్న ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ఈఫిల్ టవర్ కంటే పెద్దది. ఈ వంతెనను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. అయితే ఈ వంతెన ఇప్పుడు విమాన ప్రయాణికులకు టూరిస్ట్ ప్లేస్‌గా మారింది.
ఇది కూడా చదవండి: ICC Hall of Fame: మిస్టర్ కూల్ ధోనికి అరుదైన గౌరవం..!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ప్రస్తుతం విమానాలు చినాబ్ బ్రిడ్జి మీదగా వెళ్తున్నాయి. వంతెన సమీపంలోకి రాగానే పైలట్లు ప్రత్యేక ప్రకటన చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన వచ్చిందంటూ అనౌన్సెమెంట్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులంతా అద్దాల్లోంచి చూస్తూ తరిస్తున్నారు. అంతేకాకుండా ప్రయాణికులంతా చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Lizard In Ice-Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. అది ఫ్యాక్టరీలో ప్యాక్ చేశారు.. నేను తయారు చేయలేదు
ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటనలో పేర్కొంది. విమానాలు చినాబ్ బ్రిడ్జి మీదగా వెళ్తుండగా పైలట్లు ప్రత్యేక ప్రకటన చేస్తున్నారని.. ఆ సమయంలో ప్రయాణికులంతా తమ మొబైల్‌లో దృశ్యాలను బంధిస్తున్నారని.. అంతేకాకుండా ఇంజనీర్లు రూపొందించిన అద్భుతాన్ని కొనియాడుతున్నారని తెలిపింది. విమానాలు.. చినాబ్ వంతెన మీదగా వెళ్లేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించింది. ఇక ఈ వంతెన చూసేందుకు సమీప ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి వీక్షిస్తున్నారు. నేలపై నుంచే కాకుండా.. ఇప్పుడు ఆకాశం నుంచి కూడా బ్రిడ్జి ఆకర్షింపబడుతోంది.
చినాబ్ బ్రిడ్జిని ప్రధాని మోడీ జూన్ 6న ప్రారంభించారు. రూ.46,000 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ చినాబ్ బ్రిడ్జి 1,315 మీటర్లు విస్తరించి ఉంది. కఠినమైన వాతావరణాన్ని కూడా ఈ వంతెన తట్టుకోగలదు. ఈ ప్రాంతం భూకంపం జోన్ 5లో ఉంది. ఇంజనీర్లు అత్యంత అద్భుతంగా ప్రణాళికలు వేసి ఈ బ్రిడ్జిని నిర్మించారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన గాలులు వీచినా ఈ వంతెనకు ఏం కాదు. బలమైన గాలులు తట్టుకునే విధంగా నిర్మించారు. ఇక వంతెన నిర్మించడానికి దాదాపు 30,000 టన్నుల ఉక్కును ఉపయోగించారు. ప్రస్తుతం ఇదే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా నిలుస్తుంది. చీనాబ్ వంతెన నిర్మాణం 2002లో ప్రారంభించగా 2022లో పూర్తైంది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి విజయవంతంగా ముగించారు.
History in the making… Just 3 days to go!
The mighty #ChenabBridge, the world’s highest railway bridge, stands tall in #JammuandKashmir.
Part of the Udhampur-Srinagar-Baramulla Railway Link (USBRL). Built to withstand nature’s toughest tests.
PM Sh @narendramodi to… pic.twitter.com/EQnC0m1per
— Dr Jitendra Singh (@DrJitendraSingh) June 3, 2025
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!