Guntur: గుంటూరు జిల్లా మందడంలో విషాదం నెలకొంది.. రోడ్డు నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన బాధితులతో సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో మంత్రి నారాయణతో తన గోడు వెళ్లబోసుకున్న బాధితుడు రామారావు… తన అభిప్రాయం చెప్పి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. మీకు మా స్థలాలు ఇచ్చి బొచ్చెలు పట్టుకుని అడుక్కోవాల్సి వస్తోందంటూ బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.. మంత్రితో మాట్లాడుతుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు వృద్ధుడు రామారావు.. అక్కడున్నవారు వెంటనే స్పందించి CPR చేశారు.. హుటాహుటిన మంత్రి నారాయణ కాన్వాయ్ వాహనంలో రామారావును మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.. అయితే, ఆస్పత్రికి వెళ్లే లోపే రామారావు ప్రాణాలు విడిచారు.. గుండెపోటుతో వృద్ధుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.. అయితే, మృతుడు దొండపాటి రామారావుకు గతంలో బైపాస్ సర్జరీ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు..
Read Also: Mumbai vs Uttarakhand: అరెరే.. రోహిత్ గోల్డెన్ డకౌట్.. అయినా గెలిచినా ముంబై..!