ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఐక్యంగా ఉందన్న సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో దౌత్య బృందాలు విజయం సాధించాయని ప్రధాని మోడీ అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు అధికార-ప్రతిపక్షాలతో కూడిన ఏడు బృందాలను ఆయా దేశాలకు కేంద్రం పంపించింది.
ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
తన కొడుకు నిర్దోషి అని.. ఏ పాపం తెలియదని సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మీడియాతో మాట్లాడింది. తన కొడుకు.. సోనమ్ ఒకే దగ్గర పని చేశారని తెలిపింది. తన కొడుకుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయింది.
దేశ రాజధాని ఢిల్లీని నిన్నామొన్నటి దాకా దుమ్ము తుఫాన్ హడలెత్తించింది. ఇప్పుడు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నిన్నటి నుంచి వేడి గాలులు తీవ్రమయ్యాయి. భానుడు భగభగ మండిపోతున్నాడు
రాజా రఘువంశీ చనిపోయి కుటుంబం అంతా బాధలో ఉంటే.. అతడి సోదరి, ఇన్ఫ్లుయెన్సర్ శ్రాస్తి రఘువంశీ మాత్రం.. పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. రాజాను భార్య అన్యాయంగా చంపేసిందంటూ.. అయ్యో.. పాపం.. దారుణం అంటూ దేశమంతా విచారం వ్యక్తం చేస్తుంటే..
ఇండోర్‌కు సంబంధించిన కొత్త జంట రాజా రఘువంశీ-సోనమ్ మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. మే 23న జంట అదృశ్యమైంది. అయితే రాజా తల్లి ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉండేది.
ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు మిస్టరీని మేఘాలయ పోలీసులు ఛేదిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. తాజాగా ప్రధాన నిందితులైన సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాకు చెందిన మొబైల్స్‌ను పరిశీలించారు.
గాజాలో మానవతా సాయం అందించేందుకు పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ ఇటలీ నుంచి నౌకలో బయల్దేరి వెళ్లింది. అయితే ఆమెను గాజాలో ఇజ్రాయెల్ దళాలు అడ్డుకున్నాయి.
ఇండోర్ వాసి రాజా రఘువంశీ హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి సోనమ్ భర్తను చంపేసినట్లుగా పోలీసులు తేల్చారు. తాజాగా రాజా రఘువంశీ అంత్యక్రియల్లో సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.