మధ్యప్రదేశ్‌కు చెందిన జంట రాజా రఘువంశీ-సోనమ్ హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అదృశ్యమైంది. కొన్ని రోజుల తర్వాత రాజా శవమై కనిపించగా.. తాజాగా అతడి భార్య పోలీసులకు చిక్కింది. భార్యనే కిరాయి ముఠాతో భర్తను చంపించినట్లుగా పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా మేఘాలయ ముఖ్యమంత్రి, డీజీపీ కూడా స్పష్టం చేశారు.
భర్త రాజా రఘువంశీని సోనమ్ చంపినట్లు వస్తున్న వార్తలను ఆమె తండ్రి తీవ్రంగా ఖండించారు. మేఘాలయ పోలీసులు కట్టు కథలు సృష్టిస్తోందని.. ఈ విషయంలో సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె సోనమ్‌కు ఏ పాపం తెలియదని తండ్రి దేవి సింగ్ మీడియాతో వాపోయాడు.
అక్రమవలసదారులపై గత కొంతకాలంగా ట్రంప్ పరిపాలన ఉక్కుపాదం మోపుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా లాస్ఏంజిల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ మృతదేహం ఆస్పత్రి సొరంగంలో లభ్యమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది. గత నెలలో మొహమ్మద్ సిన్వర్‌ను చంపేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
మేఘాలయలో అదృశ్యమైన హనీమూన్ జంట కేసులో దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. గత రెండు వారాలకుపైగా ఉత్కంఠగా సాగిన మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.
గాజాలో మానవతా సాయం చేసేందుకు వెళ్తున్న పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ బృందాన్ని ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది. ఫ్రీడమ్ ఫ్లొటిల్లా కూటమి అనే సంస్థ ఆధ్వర్యంలో గాజాకు వస్తున్న ఈ నౌకలో థన్‌బర్గ్, 12 మంది ఆందోళనకారులు ఉన్నారు.
ఇజ్రాయెల్-గాజా మధ్య గత రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. 2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకారంగా గాజాపై దాడి చేస్తూనే ఉంది. హమాస్ అంతమే లక్ష్యంగా భీకరదాడులు చేస్తోంది.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు అనుసంధానం ఇన్నాళ్లకు వాస్తవ రూపం దాల్చిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రపంచంలో ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని ప్రారంభించారు.
కొంత మంది సినిమాల్లో మాదిరిగా.. నిజ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయని ఊహించుకుంటారు. కానీ అంతా అయ్యాకగాని తత్వం బోధపడదు. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ఆ మధ్య టాలీవుడ్లో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ సినిమాలో హీరో మాదిరిగా