ప్రధాని మోడీ 11 ఏళ్లలో దేశ ముఖ చిత్రాన్ని మార్చేశారని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. జూన్ 9 నాటికి మోడీ ప్రభుత్వం వచ్చి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. దేశంలో మోడీ రాజకీయ సంస్కృతిని మార్చారని.. ప్రభుత్వాన్ని జవాబుదారీగా మార్చారని పేర్కొన్నారు. ఈ 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఊహించలేని విజయాలను సాధించిందని కొనియాడారు. ప్రాముఖ్యంగా భారత రాజకీయ సంస్కృతిలో కొత్త శకానికి నాంది పలికారని ప్రశంసించారు. ఈ 11 ఏళ్ల పరిపాలనను సువర్ణాక్షరాలతో లిఖించొచ్చని చెప్పారు. సాటిలేని అభివృద్ధిని సాధించినట్లు అభిప్రాయపడ్డారు. దేశం అభివృద్ధి చెందడమే కాకుండా.. దేశ భవిష్యత్‌కు కూడా మంచి ప్రణాళిక వేశారని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Rinku Singh: ఈ క్షణానికి మూడేళ్లు ఎదురు చూశాం.. ఎంగేజ్మెంట్‌పై భావోద్వేగ పోస్ట్..!
జమ్మూకాశ్మీర్ నుంచి 370 ఆర్టికల్ తొలగించడం సాధ్యం కాదన్నారని.. కానీ మోడీ ప్రభుత్వం దాన్ని తొలగించిందని చెప్పారు. ఫలితంగా లోక్‌సభ ఎన్నికల్లో 58.46 శాతం ఓట్లు పోలయ్యాయన్నారు. ఇక జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 63 శాతం ఓట్లు పోలయ్యయాని గుర్తుచేశారు. మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్లే ఈ మార్పు వచ్చిందని చెప్పుకొచ్చారు. గత దశాబ్ద కాలంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను జాగ్రత్తగా చూసుకున్నట్లు తెలిపారు. ఇక మహిళల ఆధారంగా అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. మహిళా పైలట్ల నుంచి సైన్యంలో ఉన్నతమైన స్థానాలకు ఎదగడం వరకు ప్రోత్సహించినట్లు తెలిపారు. దేశంలో 25 కోట్ల మంది దారిద్ర్యరేఖ నుంచి బయటపడ్డారని… ఈ విధంగా తీవ్ర పేదరికం 80 శాతం తగ్గిందని నడ్డా చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Badshah : ఆమెతో పిల్లల్ని కంటా బ్రో.. నోరుజారిన స్టార్ సింగర్