లాస్ ఏంజిల్‌లో అక్రమవలసలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అక్రమవలసదారుల్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే హఠాత్తుగా పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. అధికారులపై నిరససనకారులు ఎదురు తిరిగారు. భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. అంతేకాకుండా వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు తగలబడ్డాయి. పరిస్థితులు చేదాటడంతో ట్రంప్.. 2 వేల మంది నేషనల్ గార్డ్ దళాలను దింపారు.
ఇది కూడా చదవండి: Pakistan Girl: జీన్స్‌లో కనిపించిన అమ్మాయిని చూసి గుబులు పట్టిన పాకిస్థా వీధులు..!
ఇక నిరసనల్లో ఎక్కువ శాతం మంది ముసుగులు, మాస్కులు ధరించి ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాస్కులు ధరించి నిరసనల్లో పాల్గొ్న్నవారిని అరెస్ట్ చేయాలని కీలక ఆదేశాలు ఇచ్చారు. ‘‘ముఖానికి ముసుగులు వేసుకున్న వ్యక్తులను ఇప్పుడే అరెస్టు చేయండి.’’ అని అమెరికా అధ్యక్షుడు తన సోషల్ ట్రూత్ ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Aamir Khan : మణిరత్నంతో ఒక్కసారైనా వర్క్ చేయాలి..
నిరసన సమయాల్లో మాస్కులు ధరించకూడదని గతంలోనే ట్రంప్ పేర్కొన్నారు. అయితే లాస్ ఏంజిల్‌లో జరిగిన ఘర్షణలో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. దీంతో నినసనకారులు పొగ నుంచి రక్షించుకోవడం కోసం ఆందోళనకారులంతా మాస్కులు ధరించారు. అయితే ఇకపై మాస్కులు ధరిస్తే మాత్రం అరెస్ట్ చేసే అధికారం ట్రంప్ ఇచ్చారు. ఇక అరెస్ట్‌లు ప్రారంభమవుతాయని పోలీస్ శాఖ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇక నిరసనకారుల్ని నియంత్రించడానికి లాస్ ఏంజిల్స్‌లో పోలీసులు గుర్రాలపై మోహరించారు.
గత కొద్ది రోజులుగా లాస్ ఏంజిల్‌లో ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లో 118 మందిని అరెస్టు చేశారు. శుక్రవారం 44 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఘర్షణలు తలెత్తాయి. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయెర్టాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు ఫెడరల్ భవనం దగ్గరకు చేరుకుని.. విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపడానికి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే డేవిడ్ హుయెర్టాను అరెస్ట్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ఆందోళనకారులు రెచ్చిపోయి వాహనాలు తగలబెట్టారు.
ఇక లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తున్న మాజీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాట్లాడుతూ.. ఇమ్మిగ్రేషన్ అరెస్టులు, గార్డుల మోహరింపు భయాందోళన కలిగిస్తున్నాయని.. అంతేకాకుండా విభజనకు దారి తీస్తోందని వ్యాఖ్యానించారు. ఇది క్రూరమైన చర్యగా అభివర్ణించారు. అత్యంత ప్రాథమిక హక్కులు మరియు స్వేచ్ఛలను కాపాడటానికి నిలబడే వారికి తాను మద్దతు ఇస్తున్నానని ఆమె అన్నారు.
Almost got hit a bit earlier on pic.twitter.com/DDJUhb63B9
— Los Angeles Scanner (@LosAngeles_Scan) June 9, 2025