భర్త రాజా రఘువంశీని ప్రియుడు రాజ్ కుష్వాహా సహకారంతో సోనమ్ చంపేసిందని పోలీసులు వెల్లడించారు. మే 11న రాజా రఘువంశీ-సోనమ్‌కి వివాహం జరిగింది. మే 20న మేఘాలయ హనీమూన్‌కు వెళ్లి మే 23న అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం లభ్యం అయింది. అతడి శరీరాన్ని చూసిన పోలీసులు హత్యగా నిర్ధారించారు. తాజాగా జూన్ 9న అతడి భార్య సోనమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియుడి సాయంతో భర్తను చంపేసినట్లుగా తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Sonam-Raja Case: రాత్రి 1 ఒంటి గంటకు సోనమ్ ఏడుస్తూ వచ్చింది.. కీలక విషయాలు బయటపెట్టిన ధాబా ఓనర్
రాజ్ కుష్వాహా-సోనమ్ ఒకే కంపెనీలో పని చేసేవారని.. వారిద్దరూ ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుకునేవారని రాజా రఘువంశీ సోదరుడు విపుల్ రఘువంశీ తెలిపారు. తానెప్పుడూ కూడా రాజ్ కుష్వాను చూడలేదని చెప్పాడు. రాజ్ కుష్వాహా ప్రమేయంతోనే సోనమ్ ఈ హత్యకు పాల్పడి ఉంటుందని పేర్కొన్నాడు. వాస్తవానికి ఈ జంట గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించాలని అనుకున్నారని.. అకస్మాత్తుగా ప్రణాళిక మార్పు చేసి మేఘాలయకు తీసుకెళ్లడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. ఇద్దరిలో ఎవరు ప్లాన్ చేశారో తెలియదని.. తిరుగు ప్రయాణ టిక్కెట్లు మాత్రం బుక్ చేసుకోలేదని చెప్పారు. ఇక తన సోదరుడి పోస్ట్ మార్టం రిపోర్టు కూడా ఇవ్వలేదని.. సోనమ్ ప్రమేయం ఉంటే వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Sonam-Raja Wedding: సోనమ్-రాజా వెడ్డింగ్ వీడియో వైరల్.. ఆ సమయంలో సోనమ్ ఎలా ఉందంటే..!
ఇక ఆదివారం అర్ధరాత్రి 1 ఒంటిగంట సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ పరిధిలోని నందగంజ్‌లో ఒక ధాబా దగ్గర తీవ్ర మనస్తాపంతో సోనమ్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఇక మేఘాలయ పోలీసులు మాత్రం.. ఆమెనే స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు చెప్పారు.
తండ్రి ఖండన
భర్త రాజా రఘువంశీని సోనమ్ చంపినట్లు వస్తున్న వార్తలను ఆమె తండ్రి తీవ్రంగా ఖండించారు. మేఘాలయ పోలీసులు కట్టు కథలు సృష్టిస్తోందని.. ఈ విషయంలో సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె సోనమ్‌కు ఏ పాపం తెలియదని తండ్రి దేవి సింగ్ మీడియాతో వాపోయాడు. తన కుమార్తె నిర్దోషి అని, ఆమెను పూర్తిగా నమ్ముతున్నట్లు చెప్పారు. భర్తను చంపే దుర్మా్ర్గురాలు కాదన్నారు. రెండు కుటుంబాల సమ్మతితోనే ఇద్దరికి వివాహం జరిపించినట్లు తెలిపారు. మేఘాలయ ప్రభుత్వమే అబద్ధాలు చెబుతోందని ఆయన అన్నారు. సోనమ్‌తో ఇంకా మాట్లాడలేదని.. అయినా ఆమె భర్తను ఎందుకు చంపుతుందని ప్రశ్నించారు. కేవలం పోలీసులే కట్టుకథలు అల్లుతున్నారన్నారు. సీబీఐ దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, హోంమంత్రి అమిత్ షాలను సంప్రదిస్తామని పేర్కొన్నారు. విచారణ జరిగితే మేఘాలయ పోలీసులు జైలుకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు.