ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు సంచలన విషయాలు సేకరించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోనమ్‌కు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీతో మే 11న వివాహం జరిగింది. అయితే పెళ్లైన 4 రోజులకే సోనమ్ తిరిగి తన పుట్టింటికి వచ్చేసింది. ఆ సమయంలోనే తన ప్రియుడు రాజ్ కుష్వాహాను కలిసింది. ఇద్దరు కలిసి రాజా రఘువంశీ మర్డర్‌కు ప్లాన్ వేశారు.
ఇది కూడా చదవండి: HBD Nandamuri Balakrishna: జై బాలయ్య.. పద్మభూషణ్ బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!
రాజ్ కుష్వాహా.. సోనమ్ తండ్రికి సంబంధించిన కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ సాగుతోంది. అయితే మధ్యలో ఏమైందో ఏమో తెలియదుగానీ ఏడాది నుంచి రాజ్ కుష్వాహా పని చేయడం మానేశాడు. ప్రస్తుతం వేరే చోట పని చేస్తున్నాడు. అయినా కూడా ఏడాది నుంచి రాజ్ కుష్వాహాతో సోనమ్ రహస్యంగా ఎఫైర్ కొనసాగిస్తోంది.
ఇది కూడా చదవండి: Fake Police Station: బీహార్‌లో ఫేక్ పోలీస్ స్టేషన్.. సంవత్సరం పాటు యథేచ్ఛగా దందాలు
మర్డర్ ప్లాన్ వేసుకున్న సోనమ్… తిరిగి ఇండోర్‌కు వచ్చింది. వాస్తవానికి హనీమూన్‌కు గౌహతి వెళ్లాలని రాజా రఘువంశీ ప్లాన్ చేశాడు. అందుకు సోనమ్ నిరాకరించింది. మేఘాలయ వెళ్లాలని పట్టుపట్టింది. దీంతో భార్య మాట కాదనలేక రాజా రఘువంశీ మేఘాలయకు టికెట్లు బుక్ చేశాడు. అలా మే 20న మేఘాలయకు వచ్చారు. వారితో పాటే ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా, ముగ్గురు కిరాయి హంతకులు వచ్చారు. ఇక కొత్త జంట స్థానికంగా ఒక స్కూటీ తీసుకుని తిరుగుతున్నారు. సోనమ్ మొబైల్ నుంచి ఎప్పటికప్పుడు ప్రియుడికి లోకేషన్లు పంపిస్తూ ఉండేది. ఇక మే 23న లోయలోకి రాజా ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన లొకేషన్ కూడా ప్రియుడికి పంపించింది. రాజా ట్రెక్కింగ్‌కు వెళ్లాక కిరాయి హంతకులు రాజాను పట్టుకుని చంపేశారు. అనంతరం మృతదేహాన్ని లోయలో పడేశారు. అలా మే 23 నుంచి జంట అదృశ్యమైంది.
అయితే బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు మేఘాలయ పోలీసులు కేసు నమోదు చేసి గాలించారు. అంతేకాకుండా స్థానికుల నుంచి కూడా వివరాలు సేకరించారు. అయితే చివరి సారిగా జంటను ఓ టూరిస్ట్ గైడ్ చూశాడు. వారితో పాటు ముగ్గురు హిందీ మాట్లాడే వ్యక్తులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులకు కీలక సమాచారం లభించడంతో డ్రోన్ల ద్వారా గాలింపు చేపట్టగా.. జూన్ 2న లోయలో రాజా మృతదేహం లభించింది. హత్యగా ధృవీకరించారు. అనంతరం భార్య సోనమ్ కోసం గాలించారు. ఎట్టకేలకు జూన్ 9న సోనమ్ సజీవంగా ప్రత్యక్షమైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో లొంగిపోయింది.
తనకు మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేశారని.. అనంతరం ఘాజీపూర్‌లో వదిలేశారని చెప్పుకొచ్చింది. దీంతో సీసీకెమెరాలను పరిశీలించగా సోనమ్ ఒంటరిగానే వచ్చినట్లుగా గుర్తించారు. దీంతో సోనమ్ కేసు నుంచి తప్పించుకునేందుకు కట్టుకథ అల్లినట్లుగా పోలీసులు తేల్చారు. ఇక మేఘాలయ పోలీసులు కూడా ముందస్తు ప్రణాళికతోనే రాజాను సోనమ్ చంపించినట్లుగా తేల్చారు. మృతదేహం కనిపించకుండా చేయాలనే ఉద్దేశంతోనే లోయలో పడిసినట్లుగా గుర్తించారు. ఇక నిందితులు కూడా నేరాన్ని అంగీకరించారు. ప్రస్తుతం మేఘాలయ పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.