Sonam: యూపీ పోలీసులతో సోనమ్ ఏం చెప్పిందంటే..!
- సోనమ్ స్టేట్‌మెంట్‌ను బయటపెట్టిన ఉత్తరప్రదేశ్ పోలీసులు
- సోనమ్ కట్టుకథ అల్లుతున్నట్లుగా తేల్చిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. సోమవారం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ పోలీసులకు పట్టుబడింది. అనంతరం ఆమెను యూపీ పోలీసులు విచారించారు. తనకు మత్తుమందు ఇచ్చి లోయలోంచి పైకి తీసుకొచ్చారని.. అనంతరం ఘాజీపూర్‌లో విడిచిపెట్టినట్లుగా ఆమె చెప్పినట్లుగా యూపీ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ అమితాబ్ యష్ మీడియాతో పేర్కొన్నారు. సోనమ్ బాధితురాలిగా చెప్పుకుందని.. పోలీసులు తన దగ్గరకు వస్తారనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్లుగా ఆమె చెప్పుకొచ్చిందన్నారు.
ఇది కూడా చదవండి: YS Jagan: కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా..? ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ సీఎం..!
Also Read
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
- BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తాను ఘాజీపూర్-వారణాసి రోడ్డులోని ధాబాలో ఉన్నట్లుగా సోనమ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఆమె కుటుంబం వెంటనే మధ్యప్రదేశ్ పోలీసులను సంప్రదించి.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ధాబాకు చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం వన్ స్టాప్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమెను మేఘాలయ పోలీసులు విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Thammudu : నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్..
ఇక సోనమ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పట్టగా.. ఆమె చెప్పిందంతా కట్టుకథగా తేలింది. సీసీ కెమెరాల్లో ఆమె ఒక్కతే వస్తున్నట్లుగా కనిపించింది. కిడ్నాపర్లు విడిచిపెట్టిన దృశ్యాలు కనిపించలేదు. దీంతో సోనమ్ కట్టుకథ అల్లిందని యూపీ పోలీసులు తేల్చారు. ఆమెకు పోలీసుల విధానాల గురించి సరైన అవగాహన లేదని.. బాధితురాలిగా నటిస్తూ తప్పించుకోవచ్చని భావించిందని.. కానీ అది విఫలమైందని అమితాబ్ యష్ తేల్చారు. ప్రస్తుతం ఈ కేసును మేఘాలయ పోలీసలు విచారిస్తున్నారని.. ఏదైనా సాయం కావాలంటే సహకరిస్తామని యూపీ పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. రాజా రఘువంశీని చంపి.. అనంతరం ఎవరు వెళ్లలేని ప్రదేశంలో మృతదేహాన్ని పడేయాలని ఒక పక్కా ప్రణాళికతో కుట్ర పన్నారని.. కానీ ఆ ప్లాన్ అంతా అట్టర్ ప్లాప్ అయిందని అమితాబ్ యష్ చెప్పుకొచ్చారు.
అయితే సోనమ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను మేఘాలయ పోలీసులు కూడా తోసిపుచ్చారు. కట్టుకథ అల్లుతున్నట్లుగా పేర్కొన్నారు. రాజ్ కుష్వాహాతో సోనమ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తేల్చారు. ఒత్తిడికి లోనై జూన్ 9న పోలీసుల ఎదుట లొంగిపోయిందని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌కు మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. అయితే తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో జంట విహరించారు. ఒక స్కూటీ అద్దెకు తీసుకుని ప్రయాణించింది. అలా కొండ ప్రాంతాల్లో పర్యటించారు. అయితే మే 23 నుంచి జంట హఠాత్తుగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో కంగారు పడి మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని కొండల్లో గుర్తించి పైకి తీశారు. మృతదేహాన్ని చూసి హత్యగా పరిగణించారు. అయితే సోనమ్ ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కూడా హత్యకు గురైందేమోనని కొండల్లో జల్లెడ పట్టారు. ఆమెకు సంబంధించిన రెయిన్ కోట్ లభించింది. దానిపై రక్తపుమరకలు కనిపించడంతో ఆమె కూడా హత్యకు గురై ఉంటుందని అంతా భావించారు. కానీ పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే సంఘటన ఎదురైంది. జూన్ 9న యూపీలో సోనమ్ ప్రత్యక్షం కావడంతో మర్డర్ మిస్టరీ వీడింది. ప్రస్తుతం సోనమ్ సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేఘాలయ పోలీసులు అదుపులో ఉన్న నిందితులను విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!