తమిళనాడు కేంద్రంగా హెచ్-1 బీ వీసాల అక్రమాలు జరుగుతున్నాయంటూ భారతీయ- అమెరికన్ దౌత్యవేత్త మహవష్ సిద్ధిఖీ సంచలన ఆరోపణలు చేశారు. హెచ్-1 బీ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలతో ట్రంప్ ఇటీవల కఠిన నిర్ణయాలు తీసుకున్నారు
కాష్ పటేల్.. భారత సంతతికి చెందిన అమెరికన్. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కీలక పదవిని కట్టబెట్టారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఎఫ్‌బీఐకు డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ను నియమించారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కొలిక్కి వచ్చిందంటూ అంతర్జాతీయంగా కథనాలు వెలువడుతున్నాయి. ఓ వైపు అమెరికా కూడా శాంతి ఒప్పందం దగ్గరలోనే ఉందని చెబుతుండగా.. ఇంకా చర్చలు జరుగుతున్నాయంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు.
ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.39 కోట్ల విలువ చేసే 39 కేజీల విదేశీ గంజాయిను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ముంబైకు తరలిస్తుండగా స్మగ్లింగ్ ముఠాను అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
అరుణాచల్‌ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం అని.. విడదీయరాని భాగం అని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్‌ప్రదేశ్ మహిళను అదుపులోకి తీసుకోవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ముంబై కాళీమాత ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. కాళీమాత విగ్రహం మేరీ మాత అలంకరణలో దర్శనమివ్వడంతో తీవ్ర కలకలం చెలరేగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.
భారతీయులందరికీ ఈరోజు ముఖ్యమైన రోజు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రధాని మోడీతో కలిసి ఆయోధ్య రామాలయంపై కాషాయ జెండాను మోహన్ భగవత్ ఆవిష్కరించారు
అయోధ్య రామమందిరంపై కాషాయ జెండాను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎన్నో ఏళ్ల సంకల్పం ఈరోజు నెరవేరిందని తెలిపారు. ధ్వజారోహణతో ఎన్నో ఏళ్ల నాటి గాయాలు మానిపోయాయని చెప్పుకొచ్చారు. రామమందిర నిర్మాణానికి సహకరించిన ప్రతి భక్తుడికి నివాళులు అర్పిస్తున్నానన్నారు.