ఉదయ్‌పూర్.. ఈ మధ్య భారతదేశంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లైన ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసిన ఉదయ్‌పూర్ పెళ్లి వీడియోలే దర్శనమిస్తున్నాయి. కళ్లు చెదిరే సెట్టింగ్‌లు.. అద్భుతమైన కళాఖండాలు.. ఎటుచూసినా అందమైన పూలతో అలంకరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే మరొక ప్రపంచాన్నే సృష్టించారు.
ఉడుపి రావడం తనకు చాలా ప్రత్యేకమైంది అని ప్రధాని మోడీ అన్నారు. కర్ణాటకలోని ఉడుపిలో మోడీ పర్యటించారు. అంతకముందు భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ఇరువైపుల నుంచి ప్రజలు పూల వర్షం కురిపించారు. అనంతరం ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠానికి వచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ముప్పు తిప్పలు పెడుతోంది. స్వచ్ఛమైన గాలి లేక నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. అనేక ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు.
వైట్‌హౌస్ దగ్గర కాల్పుల ఘటనతో అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పేద దేశాల నుంచి శాశ్వతంగా వలసలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైట్‌హౌస్ దగ్గర ఆప్ఘన్ జాతీయుడు రెహ్మానుల్లా కాల్పులకు తెగబడ్డాడు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య స్నేహం మళ్లీ చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోనే ఉదాహరణగా ఉంది. గురువారం థాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో ట్రంప్-మస్క్ పక్కపక్కనే కూర్చుని లంచ్ చేశారు.
అగ్ర రాజ్యం అమెరికా పరిపాలన కేంద్రం వైట్‌హౌస్ దగ్గర కాల్పులు తీవ్ర అలజడి రేకెత్తించింది. నేషనల్ గార్డ్స్పై ఆప్ఘని వాసి జరిపిన కాల్పులు అధ్యక్షుడు ట్రంప్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇద్దరు గార్డ్స్పై కాల్పులు జరపగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొకరు చికిత్స పొందుతున్నారు.
గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్. మగువలకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. శుక్రవారం మాత్రం ధరలు ఝలక్ ఇచ్చాయి. దీంతో పుత్తడి కొనాలంటేనే పసిడి ప్రియులు హడలెత్తిపోతున్నారు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 710 పెరగగా.. కిలో వెండిపై రూ. 3,000 పెరిగింది.
యుద్ధ భూమి నుంచి తప్పుకుంటే ఏ పార్టీకి మనుగడ ఉండదని ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్ మాధవ్ అన్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పని తీరుపై రామ్ మాధవ్ విమర్శలు గుప్పించారు.