కాష్ పటేల్.. భారత సంతతికి చెందిన అమెరికన్. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కీలక పదవిని కట్టబెట్టారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఎఫ్‌బీఐకు డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ను నియమించారు. అయితే ఆ హోదాకు తగిన గౌరవాన్ని తీసుకురావడంలో కాష్ పటేల్ విఫలమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా ప్రియురాలి ఈవెంట్‌కు అధికారికంగా జెట్‌ను ఉపయోగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీన్ని సమర్థిస్తూ ఆమె జాతీయురాలు అంటూ వెనకేసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Trump: అలా జరిగితేనే పుతిన్-జెలెన్‌స్కీని కలుస్తా.. ఉక్రెయిన్-రష్యా ఒప్పందంపై ట్రంప్ వ్యాఖ్య
అయితే ప్రియురాలి కోసం జెట్ వేసుకువెళ్లడం.. అలాగే ట్రంప్ బృందంలోని వ్యక్తులతో కాష్ పటేల్ అనేక విభేదాలు కలిగి ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని.. వచ్చే నెలలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించవచ్చని అంతర్గత చర్చలతో పరిచయం ఉన్న ముగ్గురు వ్యక్తులు ఉటంకిస్తూ వార్త కథనాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Mumbai: ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత.. 8 మంది స్మగ్లర్లు అరెస్ట్
కాష్ పటేల్ వ్యవహారశైలిపై ట్రంప్‌కు చెందిన సీనియర్ సహాయకులు నిరాశలో ఉన్నట్లుగా సమాచారం. ఇక ప్రభుత్వ వనరులను సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం.. అలాగే ట్రంప్ ఇతర మిత్రులతో కూడా కాష్ పటేల్ వివాదాలు ఉన్నట్లుగా వర్గాలు తెలిపాయి. ప్రియురాలి కోసం జెట్ వేసుకువెళ్లడం ట్రంప్ సన్నిహితులకు రుచించలేదని సమాచారం. దీంతో కాష్ పటేల్‌ను తొలగించి ఆయన స్థానంలో ఎఫ్‌బీఐలో సీనియర్ అధికారిగా ఉన్న ఆండ్రూ బెయిలీని నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ట్రంప్ కూడా సంకేతాలు ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ వార్తలను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవట్ తోసిపుచ్చారు. మీడియాలో వస్తున్న కథనాలు అబద్దం అంటూ కొట్టిపారేశారు. ఈ వార్తలు వచ్చినప్పుడు తాను ఓవల్ కార్యాలయంలోనే ఉన్నానని.. అప్పుడు ట్రంప్‌తో కాష్ పటేల్ ఉన్నారని చెప్పుకొచ్చారు. తామంతా నవ్వుకున్నట్లు తెలిపారు.