అరుణాచల్‌ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం అని.. విడదీయరాని భాగం అని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్‌ప్రదేశ్ మహిళను అదుపులోకి తీసుకోవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. షాంఘై విమానాశ్రయంలో 18 గంటల పాటు నిర్బంధించడంపై తప్పుపట్టింది. భారతీయ మహిళ పాస్‌పోర్టును నిరాకరించడంపై భారత్ నిరసన వ్యక్తం చేసిందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. చైనాకు తమ వాదనను వినిపించామని.. నిర్బంధంపై ఇంకా చైనా వివరణ ఇవ్వలేదని విదేశాంగ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Ayodhya : అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం- కాషాయ పతాకాన్ని ఆవిష్కరించిన మోదీ
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన థాంగ్‌డోక్ అనే మహిళ నవంబర్ 21న లండన్ నుంచి జపాన్‌కు వెళ్లే విమానం ఎక్కింది. ట్రాన్సిట్‌హాల్ట్ కోసం విమానం చైనాలోని షాంఘైలో ఆగింది. దీంతో థాంగ్‌డోక్‌కు చెందిన పాస్‌పోర్ట్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. పుట్టిన ప్రాంతం అరుణాచల్‌ప్రదేశ్ అని ఉండడంతో ఇమిగ్రేషన్ అధికారులు 18 గంటల పాటు నిర్బంధించారు. పాస్‌పోర్ట్ చెల్లదని, అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని, తమ దేశం పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోమని హేళన చేసినట్లుగా బాధితురాలు సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం తనను ఆహారం కొనేందుకు కూడా అనుమతించలేదని, భారత దౌత్య సిబ్బంది సహాయంతో తాను అక్కడి నుంచి బయటపడ్డానని తెలిపింది.
ఇది కూడా చదవండి: Story Board : అమరావతి పూర్తవ్వకపోతే చంద్రబాబుకు కష్టాలేనా.?
చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు వ్యవహరించిన తీరుపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికీ భారత్‌లో భాగమని.. విడదీయరాని భాగం అని పేర్కొంది. భారత పాస్‌పోర్టుతో ప్రయాణించేందకు పూర్తి అర్హురాలు అని చైనాకు స్పష్టం చేసింది.