చైనాను నాశనం చేయగల అద్భుతమైన కార్డులు తన దగ్గర ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ నేత, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంటిపై ఈడీ దాడులు చేస్తోంది. ఆస్పత్రి నిర్మాణ కుంభకోణంలో సౌరభ్ భరద్వాజ్ నివాసం, మరో 12 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేస్తున్నారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో 13 చోట్ల దాడులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు నడిచాయి. భారత్ మంచి స్నేహితుడు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ సుంకాలు కారణంగా ఆ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
గాజాను స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ ముందుకు దూసుకుపోతుంది. ఇందులో భాగంగా దాడులను ఉధృతం చేసింది. సోమవారం గాజా ఆస్పత్రిపై భారీ వైమానిక దాడి జరిగింది.
ప్రధానమంత్రి కార్యాలయం మంగళవారం అత్యున్నత సమావేశం నిర్వహిస్తోంది. ప్రధాని మోడీకి ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానికి నేతృత్వం వహించనున్నారు. బుధవారం నుంచి ట్రంప్ విధించిన 50 శాతం సుంకం అమల్లోకి రానుంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో భారత్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాలను భారత్ నిలిపివేసింది. అంతేకాకుండా ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి.
స్టాండప్ కమెడియన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. దివ్యాంగులపై షోల్లో జోక్‌లు వేయడంపై తీవ్రంగా తప్పుపట్టింది. తక్షణమే సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. జరిమానాలు కూడా తప్పవని హెచ్చరించింది.
జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో వర్ధమాన క్రికెటర్ ప్రాణాలు కోల్పోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ కాగా.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.
కళంకితులెవరైనా రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కళంకిత నేతలు జైలు నుంచి పరిపాలించడమేంటి? అని ప్రశ్నించారు.