కేరళలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆరోపణలు రాగానే ముందుగానే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. తాజాగా అతడిని పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడి ప్లాన్ తెలుసుకుని పోలీసులే షాక్‌కు గురయ్యారు. ఇక అంతకంటే ముందే సుప్రీంకోర్టు దగ్గరే భారీ దాడికి ప్లాన్ చేశాడు.
హౌతీయుల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. యెమెన్ రాజధాని సనాలో అధ్యక్ష భవనం సమీపంలో ఇంధన గిడ్డంగి, రెండు విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా ఐడీఎఫ్ దాడి చేసింది.
జమ్మూను భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జమ్మూ అతలాకుతలం అయింది. భారీ వర్షం కారణంగా కథువా, సాంబా, రియాసి, ఉధంపూర్ సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది.
ప్రధాని మోడీ సోమవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో మోడీ పాల్గొననున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి కేసులో మరొక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తహసీన్ సయ్యద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అదుపులోకి తీసుకున్నారు. తహసీన్ సయ్యద్.. ప్రధాన నిందితుడు సకారియా రాజేష్‌భాయ్ ఖిమ్జీ(41) స్నేహితుడిగా గుర్తించారు.
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన కూకట్పల్లి సహ్రస హత్య కేసు మిస్టరీ వీడింది. హత్య కేసు మిస్టరీని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. సహస్రను చంపింది పక్కింటి పదో తరగతి బాలుడు అని తెలిపారు.
క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం వచ్చి సహస్రను చంపేసినట్లుగా పోలీసులు తెలిపారు. కూకట్పల్లి సహస్ర హత్య కేసు వివరాలను శనివారం పోలీసులు వెల్లడించారు. సహస్ర ఇల్లు-నిందితుడి ఇల్లు పక్కపక్కనే ఉండడంతో క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకున్నాడని చెప్పారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. శనివారం ఇంఛార్జ్ మంత్రులు సమావేశం అయ్యారు. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, జూబ్లీహిల్స్ ఇంఛార్జ్ చైర్మన్లు పాల్గొన్నారు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ సంస్థాగత నిర్మాణం, పీఏసీ అజెండాపై చర్చిస్తున్నారు.