పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో భారత్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాలను భారత్ నిలిపివేసింది. అంతేకాకుండా ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి.
ఇది కూడా చదవండి: Supreme Court: దివ్యాంగులపై జోకులేంటి? కమెడియన్లపై సుప్రీంకోర్టు సీరియస్
ఇలాంటి తరుణంలో దయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ కీలక అలర్ట్ జారీ చేసింది. తావి నదిలో వరదలు వచ్చే అవకాశం ఉందని భారత్ సూచించినట్లుగా పాకిస్థాన్‌కు చెందిన ది న్యూస్ మీడియా సంస్థ తెలిపింది. వరదలు వచ్చే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్‌ను భారత్ సంప్రదించినట్లుగా మీడియా పేర్కొంది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ఆదివారం ఈ హెచ్చరికను తెలియజేసిందని ఆ పత్రిక తెలిపింది.
ఇది కూడా చదవండి: Avoid These People: మైండ్ పీస్ కావాలంటే వీరి నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి!
ఇక భారతదేశం అందించిన సమాచారం ఆధారంగా పాకిస్థాన్ అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లుగా పేర్కొంది. ఆగస్టు 30 వరకు పాకిస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) హెచ్చరించింది. ఇక భారీ వర్షాలు కారణంగా శనివారం నాటికి 788 మంది చనిపోయారని.. 1,018 మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఘటనలో పాకిస్థాన్‌లో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అంతేకాకుండా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. అనంతరం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది.