వరంగల్‌లో ఓ ఎస్సై రెచ్చిపోయాడు. మహిళ అని కూడా చూడకుండా దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదేం దారుణం అంటూ ప్రశ్నిస్తున్నారు.
టెక్నికల్‌గా తానింకా బీఆర్ఎస్లోనే ఉన్నానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఎన్టీవీతో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీస్‌లపై గద్వాల ఎమ్మెల్యే స్పందించారు.
రహస్యమనేది ఎప్పటికైనా బయటపడకుండా పోదంటారు. ఏదొక రోజున.. ఏదొక విధంగా రహస్యం బయటపడుతుంది. గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా సాగిస్తున్న ప్రేమాయణం.. ఓ ఆన్లైన్ పేమెంట్ ద్వారా బట్టబయలైంది.
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్ల మార్పు రావడం లేదు. నిత్యం ఎక్కడో చోట మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మంచిర్యాలకు చెందిన యువతికి ఆన్లైన్లో వేధింపులు ఎక్కువయ్యాయి.
భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ మాజీ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల బండారు దత్తాత్రయ తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు. సురవరం భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సురవరం సుధాకర్‌రెడ్డి.. నిరంతరం పేదల అభ్యున్నతి కోసమే పాటుపడిన నాయకుడు అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు సంతాపం తెలిపారు.
భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌కు నూతన రాయబారిగా సెర్గియో గోర్‌ను నియమించారు. తన సన్నిహితుడు, రాజకీయ సహాయకుడు సెర్గియో గోర్(38)ను భారత రాయబారిగా నియమించినట్లు సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. న్యూయార్క్ హైవేపై భారతీయులతో ప్రయాణిస్తున్న టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఐదుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై ప్రతిపక్షాల తీవ్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల వేదికగా విపక్షాలు నిరసనలు కొనసాగించాయి.
కర్ణాటక అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ నోట ఆర్ఎస్ఎస్కు చెందిన గీతాన్ని ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై రకరకాలైన కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు స్వరం మారింది.. రేపు పార్టీ మారుతుందని కామెంట్లు వస్తున్నాయి.