ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. చారిత్రాత్మక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఏడు నగరాల్లో పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణ కోసం..
ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం మోడీ జపాన్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఆగస్టు 29-30 తేదీల్లో జపాన్‌లో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలో పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలియజేశారు.
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. దోడాలో మేఘావృతం కారణంగా ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి. నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. పది ఇళ్లులు ధ్వంసమయ్యాయి.
రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు భారత్, చైనాపై కారాలు.. మిరియాలు నూరుతున్నారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
తమిళనాడులో ప్రస్తుతం నిరసన రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా అధికార పార్టీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. మొన్నటికి మొన్న ఓ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ రవి దగ్గర నుంచి డీఎంకే నేత భార్య జీన్ జోసెఫ్ డిగ్రీ పట్టా తీసుకునేందుకు నిరాకరించింది.
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే ఈలోపే బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. బీహార్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే కొత్త అధ్యక్షుడిని నియమించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి.
జగదీప్ ధన్ఖర్.. మాజీ ఉపరాష్ట్రపతి. జూలై 21న అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల చేత పదవికి రాజీనామా చేసినట్లు రాష్ట్రపతికి లేఖ పంపారు. అప్పటి నుంచి బహిరంగంగా ఎప్పుడూ కనిపించలేదు.
ఎన్ని కఠిన శిక్షలు వచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. ఎక్కడొక చోటు దారుణాలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రేమ కారణంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. పెళ్లికి చేసుకునేందుకు నిరాకరించిందన్న కోపంతో ఓ ప్రియుడు ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రియురాలిని చంపి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.
గోల్డ్ లవర్స్‌కు మళీ షాక్ తగిలింది. పసడి ధరలు మళ్లీ హడలెత్తిస్తున్నాయి. భారత్‌పై ట్రంప్ విధించిన జరిమానా సుంకం బుధవారం నుంచి అమల్లోకి రానుంది. 50 శాతం సుంకం అమల్లోకి రానున్న నేపథ్యంలో మళ్లీ పుత్తిడి ధరలు పెరిగిపోయాయి. సిల్వర్ ధర మాత్రం ఉపశమనం కలిగించింది.