Trump: ఆ కార్డులాడితే చైనా వినాశనమే.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- ఆ కార్డులాడితే చైనా వినాశనమే
- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాను నాశనం చేయగల అద్భుతమైన కార్డులు తన దగ్గర ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ.. వాణిజ్య యుద్ధంలో బీజింగ్ కంటే వాషింగ్టన్ స్థానం బలంగా ఉందని వ్యాఖ్యానించారు. చైనాను నాశనం చేయగల అద్భుతమైన కార్డులు తమ దగ్గర ఉన్నాయని.. తాను ఇంకా పట్టుకోలేదని చెప్పారు.
ఇది కూడా చదవండి: Saurabh Bhardwaj: ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఇంటిపై ఈడీ దాడులు
Also Read
చైనాతో తమకు గొప్ప సంబంధం ఉండబోతుందన్నారు. వారికి కొన్ని కార్డులు ఉన్నాయి.. అలాగే మా దగ్గర కూడా అద్భుతమైన కార్డులు ఉన్నాయని చెప్పారు. కానీ ఆ కార్డులతో ఆడాలనుకోవడం లేదని పేర్కొన్నారు. ఆడితే మాత్రం చైనాను నాశనం చేస్తుందని చెప్పుకొచ్చారు. అందుకే ఆ కార్డులు ఆడబోవడం లేదని ట్రంప్ వివరించారు.
ఇది కూడా చదవండి: Trump-Modi: రేపటి నుంచి ట్రంప్ కొత్త సుంకం అమలు.. భారత్ స్పందన ఇదే!
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఇటీవల మాట్లాడినట్లుగా ట్రంప్ చెప్పారు. రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నందున ఇద్దరం కలిసే అవకాశాలపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఏదొక సమయంలో.. బహుశా ఈ ఏడాది గానీ… కొద్ది కాలంలో గానీ చైనాకు వెళ్లనున్నట్లు వివరించారు. గత నెలలోనే జిన్‌పింగ్.. ట్రంప్‌కు ఆహ్వానం పంపారు. చైనా ఆహ్వానం మేరకు ట్రంప్ వెళ్లనున్నారు. ఇక ఆగస్టు 12న చైనాపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు పొడిగించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. అరుదైన ఖనిజాల సరఫరాను నిలిపివేస్తే చైనాపై 200 శాతం సుంకాలు విధించేందుకు కూడా వెనుకాడబోమని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఆటోమొబైల్, రక్షణ రంగానికి అవసరమైన మ్యాగ్నెట్స్ సరఫరాను చైనా కొనసాగించాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు.
#WATCH | Washington DC | "We are going to have a great relationship with China…They have some cards. We have incredible cards, but I don't want to play those cards. If I play those cards, that would destroy China. I am not going to play those cards" says US President Donald… pic.twitter.com/PDlNPkkmm2
— ANI (@ANI) August 25, 2025
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!