అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఓ దుండగుడు తుపాకీతో చెలరేగిపోయాడు. కేథలిక్ పాఠశాల విద్యార్థులే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8, 10 వయసు గల ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బీహార్ పర్యటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. బీహార్‌లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో బుధవారం స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్, డీఎంకే నేతలు గతంలో బీహారీయులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ గుర్తు చేసింది. వీటికి సమాధానం ఏదంటూ నిలదీస్తోంది.
బీహార్‌లో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
తావి నదిలో భారీగా వరదలు ముంచెత్తే అవకాశం ఉందని ఇటీవల పాకిస్థాన్‌ను భారత్ హెచ్చరించింది. తాజాగా మరోసారి ఇస్లామాబాద్‌కు వార్నింగ్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జమ్మూకాశ్మీర్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రికార్డ్ స్థాయిలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. అన్ని వ్యవస్థలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇక దోడాలోని భలీసా ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కాలువలు పొంగిపొర్లాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.
గాజా స్వాధీనమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకు వెళ్తోంది. దీంతో ఐడీఎఫ్ భీకరదాడులు చేస్తోంది. తాజా దాడులు మీడియా సంస్థలు లక్ష్యంగా జరుగుతున్నాయని అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రపంచం వ్యాప్తంగా ఆరు యుద్ధాలను తానే ఆపానంటూ ట్రంప్ పదే పదే చెబుతుంటారు. ఇదే క్రమంలో భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని కూడా తానే ఆపానంటూ ట్రంప్ ఎక్కడికెళ్లినా చెబుతున్నారు.
రాత్రియుగం నుంచి రాకెట్ యుగానికి వచ్చాం. కాలాలు.. పరిస్థితులు మారాయి. ఒకప్పుడు అజ్ఞానంతో దారుణాలకు ఒడిగట్టేవారు. ఇప్పుడు విజ్ఞానం పెరిగింది.. సంపద పెరిగింది. ఇలాంటి తరుణంలో క్రైమ్ రేట్ తగ్గాల్సింది పోయి.. క్రమక్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నేటి నుంచి భారత్‌పై 50 శాతం సుంకాలు అమలవుతున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
ఫిజీ ప్రధాని రబుకా మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో ఫిజీ ప్రధాని రబుకా బృందం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. సోమవారం నాడు వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చలు జరిపినట్లు వర్గాలు పేర్కొన్నాయి.