దుబాయ్ యువరాణి షేకా మహ్రా మళ్లీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గతేడాది సోషల్ మీడియాలో భర్తకు విడాకులు ప్రకటించి సంచలనం సృష్టించిన ఆమె.. తాజాగా మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం సుంకం అమల్లోకి వచ్చాయి. ఇక భారత్-అమెరికా మధ్య కూడా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు.
బీహార్‌లో బడుగు బలహీనవర్గాల ప్రజల ఓట్లే తొలగించారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటర్ అధికార్ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ బీహార్‌లో పర్యటిస్తున్నారు.
అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-35 జెట్ విమానం కూలిపోయింది. అలాస్కా రన్‌వేపై కూలిపోయింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే పారాచూట్ ఉపయోగించి సురక్షితంగా నేలపైకి రాగా.. విమానం మాత్రం కింద పడిపోయి పేలిపోయింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీహార్ పర్యటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. ఎన్నికల సంఘం.. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
భారత్‌పై ఏదో కోపం పెట్టుకున్నట్లుగానే ట్రంప్ వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కక్ష సాధింపులో భాగంగానే భారత్‌పై భారీగా సుంకాలు విధించినట్లుగా తెలుస్తోంది. ఆసియాలో ఒక్క భారత్‌పైనే భారీగా సుంకం విధించారు. దీంతో ఇది ఉద్దేశపూర్వకంగానే ట్రంప్ ఇలా వ్యవహరిస్తున్నట్లుగా నిపుణులు భావిస్తున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కాల్పులు తీవ్ర కలకలం రేపుతోంది. బుధవారం అమెరికాలోని మిన్నియాపాలిస్ నగరంలో చర్చి సేవకు హాజరైన కేథలిక్ పాఠశాల పిల్లలపై దుండగుడు కాల్పులు జరపడంతో 8, 10 ఏళ్ల వయసు గల ఇద్దరు విద్యార్థులు చనిపోగా.. అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
నేటి కాలంలో చాలా మంది ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకునే దంపతులు ఉన్నారు. ఇంకొందరు సర్జరీలు కారణంగా ఇద్దరు కంటే ఎక్కువ మందిని కనలేని పరిస్థితి ఉంది. మరికొందరు ఆర్థిక పరిస్థితులు కారణంగా ఎక్కువ మంది బిడ్డలను కనలేని పరిస్థితులున్నాయి.
జమ్మూకాశ్మీర్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భద్రతా సిబ్బంది.. అధికారులు సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబాటుకు యత్నించారు.