అక్టోబర్ 7, 2023. ఇది ఎవ్వరూ మరిచిపోలేని తేది. ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన రోజు. హమాస్ ఉగ్రవాదులు మెరుపు వేగంతో ఇజ్రాయెల్‌పై దాడి చేసి కొందరిని చంపి.. ఇంకొందరిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ సంఘటన యావత్తు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ప్రసాదం వివాదం కారణంగా ఒకరు హత్యకు గురయ్యారు. కొందరు వ్యక్తులు.. ఆలయ సేవకుడిని అత్యంత దారుణంగా కర్రలతో కొట్టి చంపేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యారు. ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత నాలుగేళ్ల నుంచి విరామం లేకుండా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
శాశ్వత మిత్రులు... శాశ్వత శత్రువులు ఉండరని.. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం సుంకాల వివాదం నడుస్తోంది.
కొన్నిసార్లు నిజం జీవితంలో కూడా సినిమాల్లో మాదిరిగానే జరుగుతుంటాయి. 2007లో షాహిద్ కపూర్-కరీనా కపూర్ నటించిన ‘జబ్ వి మెట్’ చిత్రం గుర్తుందా? ఆ చిత్రం ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. అచ్చం అదే సినిమా మాదిరిగా ఇండోర్‌లో జరిగింది.
జమ్మూకాశ్మీర్‌ను వరదలు విడిచిపెట్టడం లేదు. కనీసం తేరుకోకముందే దెబ్బ మీద దెబ్బతో క్లౌడ్ బరస్ట్‌లతో ప్రజలను బెంబేలెత్తించేస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు.. వరదలతో తిండి తిప్పలు లేక అల్లాడిపోతుంటే.. వరుస క్లౌడ్ బరస్ట్‌లతో ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు.
ప్రధాని మోడీ జపాన్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం జపాన్ చేరుకున్నారు. శుక్రవారం టోక్యో వ్యాపార వేత్తలతో సమావేశం అయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
రష్యాలో భారీ విస్ఫోటనం జరిగింది. డాగేస్తాన్ గ్యాస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్లుగా అధికారులు తెలిపారు.
పహల్గామ్ ఉగ్రదాడి యావత్తు ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో ముష్కరులు తుపాకులతో చెలరేగిపోయారు. 26 మందిని మతం పేరుతో చంపేశారు. ఈ సంఘటన భారత్‌తో పాటు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
భారతీయ సాంప్రదాయ ప్రకారం ఒకరినే వివాహం చేసుకోవాలి. ఆమెతోనే కలకలం జీవించాలి. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు మాత్రం భార్య చెల్లిని కూడా ఇచ్చి పెళ్లి చేయాలంటూ భీష్మించాడు. విద్యుత్ టవర్ ఎక్కి నానా హంగామా సృష్టించాడు.