Trump-Modi: ట్రంప్ సుంకాలతో వచ్చే నష్టమేంటి? భారత్ ప్లాన్ ఏంటి?
- ట్రంప్ సుంకాలతో వచ్చే నష్టమేంటి?
- అంచనా వేసిన ఆర్థిక శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌పై ఏదో కోపం పెట్టుకున్నట్లుగానే ట్రంప్ వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కక్ష సాధింపులో భాగంగానే భారత్‌పై భారీగా సుంకాలు విధించినట్లుగా తెలుస్తోంది. ఆసియాలో ఒక్క భారత్‌పైనే భారీగా సుంకం విధించారు. దీంతో ఇది ఉద్దేశపూర్వకంగానే ట్రంప్ ఇలా వ్యవహరిస్తున్నట్లుగా నిపుణులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆగస్టు 27 నుంచి భారత్‌పై 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామని భారత ప్రభుత్వం చెబుతున్నా.. ప్రభావం మాత్రం ఎక్కువగానే ఉంటుందని ఆర్థిక శాఖ అంచనాకు వచ్చింది. దీంతో అమెరికాతో వాణిజ్య చర్చలు జరగాల్సి ఉందని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది.
Also Read
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
ఇది కూడా చదవండి: US: ట్రంప్‌ను చంపేయండి.. విద్యార్థులపై కాల్పులు జరిపిన నిందితుడి తుపాకీపై రాతలు
భారత ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు ప్రస్తుతం పరిమితంగా అనిపించవచ్చు కానీ ఆర్థిక వ్యవస్థపై మాత్రం ప్రభావం ఎక్కువగానే ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక నివేదికలో తెలిపింది. తప్పనిసరిగా ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరగాల్సి ఉంటుందని పేర్కొంది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నెలవారీ ఆర్థిక సమీక్ష తెలిపింది. 50 శాతం భారీ సుంకం కారణంగా 48 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఎగుమతులపై ప్రభావం చూపునున్నట్లు తెలుస్తోంది. వస్త్రాలు/దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, తోలు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, యాంత్రిక యంత్రాలపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్‌లో అరుదైన సంఘటన.. 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
భారత్‌పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోడీ కారణంగానే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపడం లేదని అమెరికా పదే పదే ఆరోపిస్తోంది. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం ఆపేస్తే.. రష్యా దిగొస్తుందని అంటోంది.
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!