అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-35 జెట్ విమానం కూలిపోయింది. అలాస్కా రన్‌వేపై కూలిపోయింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే పారాచూట్ ఉపయోగించి సురక్షితంగా నేలపైకి రాగా.. విమానం మాత్రం కింద పడిపోయి పేలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Annamalai: స్టాలిన్‌ది కపట రాజకీయం.. బీహార్ టూర్‌పై అన్నామలై విమర్శలు
ఎఫ్-35 జెట్ విమానం టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించాడు. ముక్కు, ప్రధాన ల్యాండింగ్ గేర్లలో హైడ్రాలిక్ లైన్‌ల్లో మంచు పేరుకుపోయింది. దీంతో విమానం సరిగ్గా పని చేయడం లేదు. దీంతో ల్యాండింగ్ గేర్‌ను వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. జామ్ అయిన నోస్ గేర్‌ను సరిచేయడానికి పైలట్ రెండుసార్లు టచ్ అండ్ గో ల్యాండింగ్‌లను ప్రయత్నించాడు. కానీ రెండు సార్లు విఫలమయ్యాడు. ల్యాండింగ్ గేర్‌లు పూర్తిగా స్తంభించిపోయినట్లు గుర్తించి.. ఇంజనీర్లతో గంట పాటు ఫోన్ కాల్‌లో గడిపినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో విమానం కూలిపోయింది. పైలట్ మాత్రం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యాడు.
ఇది కూడా చదవండి: US: ట్రంప్‌ను చంపేయండి.. విద్యార్థులపై కాల్పులు జరిపిన నిందితుడి తుపాకీపై రాతలు
JUST IN: F-35 fighter jet crashes at Eielson Air Force Base in Alaska. The pilot survived pic.twitter.com/zEuPNY8jqk
— BNO News (@BNONews) January 29, 2025