జమ్మూకాశ్మీర్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భద్రతా సిబ్బంది.. అధికారులు సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబాటుకు యత్నించారు. దీంతో భారత సైన్యం అప్రమత్తమై చొరబాటును భగ్నం చేసింది. సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: US: అమెరికా పాఠశాలలో కాల్పులు.. ఇద్దరు చిన్నారుల మృతి.. దుండుగుడు ఆత్మహత్య
ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసిందని అధికారులు తెలిపారు. నౌషెహ్రా నార్ సమీపంలో ఈ ఆపరేషన్ జరిగినట్లుగా చెప్పింది. ఎన్‌కౌంటర్ తర్వాత చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకా ఎవరైనా చొరబాటుదారులు ఉన్నారేమోనన్న కారణంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు..
ఆగస్టు నెల ప్రారంభంలో ఆపరేషన్ అఖల్ కింద ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఒక సైనికుడు గాయపడ్డాడు. ఈ ఆపరేషన్ మొత్తంలో ఆరుగురు ఉగ్రవాదులు మరణించారు. ఈ ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా (LeT) ప్రాక్సీ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)తో అనుబంధంగా ఉన్నవారుగా అధికారులు నిర్ధారించారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది మరణానికి కారణమైంది ఈ ఉగ్రవాద సంస్థే.