దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
బీహార్లో ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇక ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు.
ప్రపంచంలోనే భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా గురువారం టోక్యో చేరుకున్నారు.
దేశంలో వరకట్న చావులు ఎక్కువైపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. ఇటీవల కాలంలో నోయిడా, యూపీ, రాజస్థాన్లో.. ఇలా దేశంలో ఎక్కడొక చోట వరకట్న పిశాచికి బలైపోతున్నారు. తాజాగా బెంగళూరు, ఉత్తరప్రదేశ్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరుస ఘటనలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.
2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడింది. మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇండియా కూటమి కూడా బాగానే బలం పుంజుకుంది. కాంగ్రెస్కు కూడా ఆశించిన స్థాయిలోనే సీట్లొచ్చాయి. ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.
ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. రుద్రప్రయాగ్లో క్లౌడ్ బరస్ట్ అయిందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. శిథిలాలు ప్రవహించే ప్రాంతాలను మూసేశామని.. దీని కారణంగా చాలా మంది ప్రజలు చిక్కుకుపోయారని చెప్పారు.
పోలాండ్ ఎయిర్ షోలో అపశృతి చోటుచేసుకుంది. ఎయిర్ షో రిహార్సల్ చేస్తుండగా ఒక్కసారిగా ఫైటర్ జెట్ కూలిపోయింది. ప్రేక్షకులు చూస్తుండగానే కూలిపోయింది. కిందపడగానే ఒక్కసారి విమానం కూలిపోయింది. పెద్ద ఎత్తున నిప్పులు చెలరేగి ఎఫ్-16 పైలట్ మృతి చెందాడు.
దేశంలో ప్రస్తుతం బీజేపీ, ఆర్ఎస్ఎస్లో ఉన్న నాయకులు 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలన్న చర్చ తీవ్రంగా నడుస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్పై చర్చ నడుస్తోంది. తాజాగా దీనిపై మోహన్ భాగవత్ క్లారిటీ ఇచ్చేశారు.
ప్రధాని మోడీ జపాన్ చేరుకున్నారు. టోక్యో చేరుకోగానే ఎయిర్పోర్టులో మోడీకి ఘనస్వాగతం లభించింది. జపాన్, చైనా పర్యటన కోసం మోడీ గురువారం బయల్దేరి వెళ్లారు. శుక్ర, శనివారం పర్యటనలో భాగంగా 15వ భారత్-జపాన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.