చైనాలోని బీజింగ్‌లో భారీ సైనిక కవాతు జరిగింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా 25 దేశాధినేతలంతా హాజరయ్యారు. చైనా సైనికులు నిర్వహించిన భారీ కవాతును నేతలంతా తిలకించారు.
కరేబియన్ సముద్రంలో వెనిజులా మాదకద్రవ్య నౌకపై అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో 11 మంది మృతి చెందారు. అంతర్జాతీయ జలాల ద్వారా అమెరికా వైపు మాదకద్రవ్యాలను రవాణా చేస్తుండగా ఈ దాడి జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
అమెరికాపై భారతదేశమే భారీగా సుంకాలు వసూలు చేస్తోందని.. ఇది చాలా సంవత్సరాలుగా ఈ సంబంధం ఏకపక్షంగా సాగిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మంగళవారం వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
చైనా వేదికగా షాంఘై సహకార సదస్సులో ఉగ్రవాదంపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. ఉగ్రవాదంపై కొన్ని దేశాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని.. దీంతో మానవాళి మనుగడకు ప్రమాదమని ప్రధాని మోడీ హెచ్చరించారు.
చనిపోయిన తన తల్లిపై కాంగ్రెస్, ఆర్జేడీ దుర్భాషలాడిందని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. తన తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని.. అయినా కూడా తన తల్లిని దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ మద్దతు పాకిస్థాన్‌కేనని అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ తేల్చిచెప్పారు. తాము పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంతో షాంఘై సహకార సంస్థలో పూర్తి సభ్వత్వ బిడ్‌ను భారత్ అడ్డుకుందని ఆరోపించారు.
ఆర్థిక స్వార్థం వల్ల ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటామని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో జరిగిన సెమికాన్ 2025 సదస్సులో మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు.
పంజాబ్‌లో ఓ ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ పఠాన్మజ్రా వీరంగం సృష్టించారు. అత్యాచారం ఆరోపణలపై మంగళవారం ఉదయం కర్నాల్‌లో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా ఎమ్మెల్యే, అతని సహాయకులు పోలీసులు కాల్పులు జరిపారు.
చైనా వేదికగా షాంఘై సహకార సదస్సులో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ కలిసి తిరిగారు. అంతేకాకుండా చాలా కులాసాగా మాట్లాడుకున్నారు. నవ్వుతూ.. ఉల్లాసంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు ప్రపంచానికి ఒక హెచ్చరికగా వెళ్లాయి.