ఆప్ఘనిస్థాన్‌ను భారీ భూకంపం వణికించింది. భూప్రకంపనలకు ఆప్ఘనిస్థాన్ చిగురుటాకులా వణికిపోయింది. ఆదివారం అర్ధరాత్రి 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి 250 మంది మరణించారు. మరో 400 మంది గాయపడ్డారు.
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికాదని.. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. చైనాలోని టియాంజిన్ వేదికగా జరుగుతున్న ఎస్సీవో శిగ్రరాగ్ర సమావేశంలో మోడీ ప్రసంగించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని మోడీ ప్రస్తావించారు.
చైనా వేదికగా జరుగుతున్న ఎస్సీవో సమావేశంలో పాక్ ప్రధానికి ప్రధాని మోడీ బిగ్ షాక్ ఇచ్చారు. కనీసం ముఖం చూసేందుకు ఇష్టపడలేదు. పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్సీవో శిఖరాగ్ర సమావేశంలో మోడీ, పుతిన్, జిన్‌పింగ్ సంభాషించుకున్నారు. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్‌ను మోడీ ఆత్మీయంగా పలకించారు.
దేశ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పలు రాష్ట్రాలు ఇంకా తేరుకోను లేదు. ఇంతలోనే కేంద్ర వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది.
అమెరికాలోని హూస్టన్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ నీట మునిగిపోయి. పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సుంకాలు చట్ట విరుద్ధం అంటూ ఫెడరల్ అప్పీల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అలాగైతే అమెరికా పూర్తిగా నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. సుంకాలను తొలగించడం అమెరికా వినాశనానికి దారి తీస్తుందని తెలిపారు.
ప్రధాని మోడీ రెండు రోజుల జపాన్ పర్యటన ముగిసింది. శుక్రవారం టోక్యో వ్యాపార వేత్తల సమావేశంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ పిలుపునిచ్చారు. శనివారం బుల్లెట్ ట్రైన్లో జపాన్ ప్రధాని ఇషిబాతో కలిసి విహరించారు.
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్ర దాడి నుంచి భారత సైన్యం ముష్కరుల కోసం వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే కీలక ఉగ్రవాదులందరినీ భారత సైన్యం హతమార్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు, మూడు రోజులుగా కనిపించడం లేదు. నిత్యం మీడియా ముందు కనిపించే ఆయన సడన్‌గా అదృశ్యమయ్యారు. దీంతో ఆయనకు ఏదో జరిగిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.