తమ మద్దతు పాకిస్థాన్‌కేనని అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ తేల్చిచెప్పారు. తాము పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంతో షాంఘై సహకార సంస్థలో పూర్తి సభ్వత్వ బిడ్‌ను భారత్ అడ్డుకుందని ఆరోపించారు.ఇస్లామాబాద్‌తో సోదరభావానికి ప్రాధాన్యత ఇస్తామని ఇల్హామ్ అలీయేవ్ వెల్లడించారు. పాకిస్థాన్‌తో అజర్‌బైజాన్ సంబంధం మరింత బలపడుతుందని చెప్పారు. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో భారత్‌పై పాకిస్థాన్ గెలిచిందని ప్రశంసించారు. ఈ ప్రతీకారంతోనే ఎస్‌సీవోలో శాశ్వత సభ్యత్వ బిడ్‌ను భారత్ అడ్డుకుందని పేర్కొన్నారు. దౌత్య సూత్రాలను భారత్ ఉల్లంఘిస్తోందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఆర్థిక స్వార్థం వల్ల ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటాం.. ట్రంప్ టారిఫ్‌లపై మోడీ ధ్వజం
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులను హతం చేసింది. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలను సైన్యం ధ్వంసం చేసింది. అనంతరం ఇరు దేశాల చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగింది.
ఇది కూడా చదవండి: Punjab: అత్యాచారం కేసులో అరెస్టైన ఆప్ ఎమ్మెల్యే వీరంగం.. పోలీసులపై కాల్పులు జరిపి పరార్
ఇక చైనా వేదికగా షాంఘై సహకార సదస్సు జరిగింది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోడీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఇతర దేశ నాయకులు హాజరయ్యారు. అయితే పాక్ ప్రధాని షరీఫ్‌ను మోడీ గానీ.. పుతిన్ గానీ పట్టించుకోలేదు. ఇక ఈ సమావేశంలో మోడీ ప్రసంగిస్తూ.. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలపై ధ్వజమెత్తారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికాదని తేల్చి చెప్పారు. ఇక పాకిస్థాన్ -భారత్ యుద్ధ సమయంలో ప్రత్యక్షంగా పాకిస్థాన్‌కు టర్కీ, అజర్‌బైజాన్, పలు దేశాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలతో మానవాళి మనుగడకు ముప్పు ఉంటుందని మోడీ హెచ్చరించారు. ఇక ఈ సమావేేశంలో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ చాలా ఉల్లాసంగా కనిపించారు.