పంజాబ్‌లో ఓ ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ పఠాన్‌మజ్రా వీరంగం సృష్టించారు. అత్యాచారం ఆరోపణలపై మంగళవారం ఉదయం కర్నాల్‌లో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా ఎమ్మెల్యే, అతని సహాయకులు పోలీసులు కాల్పులు జరిపారు. అనంతరం అడ్డుకునే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్‌ను కూడా ఢీకొని పారిపోయారు. వాహనాలను పోలీసులు అడ్డుకోగా.. మరొక వాహనంలో ఎమ్మెల్యే తప్పించుకుని పారిపోయారు. దీంతో పంజాబ్‌లో తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: US: మోడీ రష్యాతో కాదు.. అమెరికాతో ఉండాలి.. ట్రంప్ వాణిజ్య సలహాదారు నవారో వ్యాఖ్య
హర్మీత్ పఠాన్‌మజ్రా.. పంజాబ్‌లోని సనౌర్ నియోజకవర్గం. పఠాన్‌మజ్రాపై అత్యాచారం, మోసం, క్రిమినల్ బెదిరింపు ఆరోపణల కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే విడాకులు తీసుకున్నట్లు అబద్ధం చెప్పి తనతో వైవాహిక సంబంధం పెట్టుకున్నట్లు మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. లైంగిక దోపిడీ, బెదిరింపులు, అశ్లీల చిత్రాలు పంపించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Kim Jong: చైనాలోకి వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన ఉత్తర కొరియా నేత కిమ్
ఇక సొంత ప్రభుత్వంపై కూడా ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. పంజాబ్‌లో వరదలను ఎదుర్కోవడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇక ఎఫ్ఐఆర్ బుక్ కాగానే.. ఫేస్‌బుక్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ఆప్ నాయకత్వం.. పంజాబ్‌లో చట్టవిరుద్ధంగా పాలిస్తోందని తెలిపారు. ఈ విషయంలో సహచర ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాలని కోరారు. జైల్లో ఉండగలనని.. తన గొంతును మాత్రం అణచివేయలేరని ఆరోపించారు.
ఎమ్మెల్యేను మంగళవారం ఉదయం కర్నాల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్‌కు తీసుకెళ్తుండగా ఎమ్మెల్యే, అతని సహాయకులు పోలీసులపై కాల్పులు జరిపారు. అనంతరం రెండు ఎస్‌యూవీ వాహనాల్లో పారిపోయారు. పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే మరొక వాహనంలో తప్పించుకున్నారు. ప్రస్తుతం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.