ధైర్యం, ధైర్యసాహసాలకు మణిపూర్ నిలయం అని ప్రధాని మోడీ అన్నారు. రెండు జాతుల మధ్య జరిగిన హింస తర్వాత రెండేళ్లకు మణిపూర్‌లో ప్రధాని మోడీ అడుగుపెట్టారు. ఉదయం ఇంఫాల్‌కు చేరుకున్న ప్రధాని.. అక్కడ నుంచి రోడ్డుమార్గంంలో చరాచంద్పూర్ చేరుకున్నారు.
ఈనెల 8న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మహీంద్రా థార్ కారు ప్రమాదంలో మహిళ చనిపోయినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత మహిళా ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక వీడియో పోస్ట్ చేసింది. తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలను ఆమె తోసిపుచ్చింది.
ప్రధాని మోడీ రెండేళ్ల తర్వాత తొలిసారి మణిపూర్‌లో అడుగుపెట్టారు. రెండు వర్గాల మధ్య చెలరేగిన హింసతో రాష్ట్రం అట్టుడికింది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. భారీ వర్షం మధ్య ప్రధాని మోడీ ఇంఫాల్‌కు చేరుకున్నారు.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగి మూడు నెలలు గడిచింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా వెలువడలేదు. ఆ మధ్య కాలంలో 15 పేజీల ప్రాథమిక నివేదిక విడుదలైంది. అయితే ఈ నివేదిక తీవ్ర దుమారం రేపింది.
యూకేలో దారుణం జరిగింది. 20 ఏళ్ల సిక్కు యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ‘‘నీ దేశానికి తిరిగి వెళ్లిపో’’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుల సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
ప్రధాని మోడీ శనివారం మిజోరాంలో చారిత్రక రైల్వే లైన్‌ను ప్రారంభించారు. మిజోరాంలోని బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ప్రధాని ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. మిజోరాం రాలేనందుకు క్షమించాలని ప్రజలను కోరారు.
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ హత్య అమెరికాను కుదిపేసింది. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఒక తూటాకే చార్లీ కిర్క్ కుప్పకూలిపోయాడు. ఇక చార్లీ కిర్క్ హత్య తర్వాత ఎఫ్‌బీఐ అధికారులు వేట సాగించారు.
వాయువ్య కాంగోలో రెండు పడవ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 193 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వాయువ్య కాంగోలో ఈ వారంలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో కనీసం 193 మంది మరణించగా.. అనేక మంది గల్లంతయ్యారని అధికారులు, రాష్ట్ర మీడియా శుక్రవారం వెల్లడించింది.
మొస్సాద్.. ఇజ్రాయెల్ అత్యంత శక్తివంతమైన నిఘా వ్యవస్థ. గురి పెట్టిందంటే పని కావాల్సిందే. అంత పగడ్బందీగా పని చేయగల సామర్థ్యం మొస్సాద్ సొంతం. అలాంటిది మొట్టమొదటిసారిగా ఖతార్‌లో విఫలమైంది. దీనికి అంతర్గత విభేదాలే కారణంగా ది వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీతో యూపీ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ వాగ్వాదం పెట్టుకున్నారు. రాయ్‌బరేలీ నియోజకవర్గ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఈ ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.