ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో ఎక్కడొక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా ఒడిశాలో ఘోరం జరిగింది. ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అమెరికా దేశ చరిత్రలో న్యూయార్క్ టైమ్స్ వార్తాపత్రిక అత్యంత చెత్త పత్రిక అని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలోనే అత్యంత దిగజారుడు వార్తాపత్రిక అంటూ నిప్పులుచెరిగారు. ‘‘రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్ పార్టీకి వర్చువల్ మౌత్ పీస్"గా ట్రంప్ అభివర్ణించారు.
అస్సాంలో ఓ మహిళా ఆఫీసర్ కోట్లకు పడగలెత్తింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా అవినీతికి తెరలేపింది. తక్కువ కాలంలోనే కోట్లు వెనకేసుకుంది. అధికారులు జరిపిన సోదాల్లో కోట్లలో నగదు దొరకడంతో సివిల్ సర్వీస్ అధికారి నుపుర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు.
మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ఫ్యామిలీని మళ్లీ కొత్త కేసులు వెంటాడుతున్నాయి. గతేడాదంతా పూజా ఖేద్కర్‌ను కేసులు వెంటాడాయి. ట్రైనింగ్ సమయంలో లేనిపోని గొంతెమ్మ కోర్కెలు కోరి పూజా ఖేద్కర్ ఇరాకటంలో పడింది.
అంతర్జాతీయ జలాల్లో అమెరికా వెళ్తున్న వెనిజులా మాదకద్రవ్య నౌకను అమెరికా సైన్యం పేల్చేసింది. ఈ మేరకు ట్రంప్ ప్రకటించారు. మాదక ద్రవ్యాలు అమెరికన్లను విషపూరితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి నవజ్యోత్ సింగ్ (52) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. భార్య సందీప్ కౌర్‌తో కలిసి ఇంటికి వెళ్తుండగా బీఎండబ్ల్యూ కారు ఢీకొని మృతిచెందారు.
ఇండోర్‌లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్.. ట్రక్కును జనాలపైకి దూసుకుపోనిచ్చాడు. దీంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాద స్థలిలో ఆర్తనాదాలు మిన్నంటాయి.
ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. డెహ్రాడూన్‌లో మంగళవారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తికొచ్చాయి. దీంతో కార్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఇళ్లులు ధ్వంసమయ్యాయి.
రైళ్లల్లో ధూమపానం.. పేలుడు పదార్థాలు తీసుకెళ్లడం నిషేధం. అంతేకాకుండా రైల్వేయాక్ట్ ప్రకారం చాలా తీవ్రమైన నేరం. అయినా కూడా కొందరు చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తూనే ఉంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రైల్లో జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి నవజ్యోత్ సింగ్ (52) మరణానికి కారణమైన బీఎండబ్ల్యూ కారు యజమాని గగన్‌ప్రీత్ కౌర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.