తన భర్త వదిలిపెట్టి వెళ్లిన వారసత్వాన్ని కొనసాగిస్తానని చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ ప్రకటించారు. బుధవారం ఉతా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ ప్రసంగిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. చార్లీ కిర్క్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు విశేష కృషి చేశాడు.
సూపర్ సిక్స్‌లో 90 శాతం అమలు చేసేశామని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు.
జెన్-జెడ్ ఉద్యమంతో నేపాల్ అల్లకల్లోలం అయింది. కనీవినీ ఎరుగని రీతిలో నేపాల్ రాజధాని ఖాట్మండు విధ్వంసానికి గురైంది. దేశంలో నాయకుల అవినీతి కారణంగా యువతలో తీవ్ర ఆగ్రహావేశాలు రగిలించింది. దీంతో జెన్-జెడ్ ఉద్యమం పేరుతో యువత చెలరేగిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. నిన్నామొన్నటిదాకా పాఠశాలల లక్ష్యంగా ప్రతిరోజూ బాంబ్ బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టుకు బాంబ్ బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు.
అగ్ర రాజ్యం అమెరికాలో రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మారణహోమం సృష్టిస్తున్నారు. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య మరువక ముందే మరో హత్య కలకలం రేపుతోంది.
పసిడి ప్రియులకు భారీ షాక్. బంగారం ధరలు మళ్లీ కొండెక్కి కూర్చున్నాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న ధరలకు గురువారం బ్రేకులు పడ్డాయి. దీంతో తగ్గుముఖం పడతాయని అనుకుంటున్న సమయంలో మళ్లీ పైపైకి వెళ్లిపోతున్నాయి.
ప్రపంచంలో అమెరికా కలిగి ఉన్న అత్యుత్తమ సంబంధాల్లో భారతదేశం ఒకటి అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఢిల్లీలో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ నియమితులయ్యారు.
మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఏమయ్యారంటూ ప్రతిపక్షం ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా లేఖలు రాసింది. జగదీప్ ధన్ఖర్ సమాచారం ఇవ్వాలని కోరింది.
రాష్ట్రపతి భవన్లో 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ, బీజేపీ మిత్ర పక్ష ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలంతా హాజరయ్యారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఓ వైపు ప్రతిపక్ష కాంగ్రెస్.. ఓట్ల చోరీ జరుగుతుందంటూ అటు బీహార్‌లోనూ..ఇటు జాతీయంగానూ పోరాటం చేస్తోంది.