వాయువ్య కాంగోలో రెండు పడవ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 193 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వాయువ్య కాంగోలో ఈ వారంలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో కనీసం 193 మంది మరణించగా.. అనేక మంది గల్లంతయ్యారని అధికారులు, రాష్ట్ర మీడియా శుక్రవారం వెల్లడించింది. ఈక్వేటర్ ప్రావిన్స్‌లో దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో బుధవారం, గురువారం ఈ ప్రమాదాలు జరిగినట్లుగా పేర్కొన్నాయి. గురువారం సాయంత్రం లుకోలెలా ప్రావిన్స్‌లోని కాంగో నది వెంబడి దాదాపు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక పడవ మంటల్లో చిక్కుకుని బోల్తా పడిందని కాంగో మానవతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదంలో 107 మంది చనిపోగా.. 209 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Hamas-Israel: ఖతార్‌లో పని చేయని ఇజ్రాయెల్ ఎత్తుగడ.. సజీవంగా హమాస్ నేతలు.. అసలేమైందంటే..!
అలాగే ఒక రోజు ముందు ప్రావిన్స్‌లోని బసంకుసు ప్రాంతంలో మోటారుతో నడిచే పడవ బోల్తా పడి 86 మంది మరణించారని.. ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని మీడియా తెలిపింది. చాలా మంది గల్లంతయ్యారని పేర్కొంది. ఆ సంఖ్య మాత్రం తెలియజేయలేదు. ఈ ప్రమాదానికి కారణాలేంటో తెలియజేయలేదు.
ఇది కూడా చదవండి: AP New Bar Policy: ఫలించని ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు.. కొత్త బార్ పాలసీ గడువు మరోసారి పొడిగింపు
అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పౌర సంఘాలు ఆరోపించాయి. ఆఫ్రికా దేశంలో పడవలు బోల్తా పడటం తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు పడవల్లోనే ప్రయాణిస్తుంటారు. రోడ్డు రవాణా కంటే జలరవాణానే చౌకగా దొరుకుతుంది. దీంతో పడవల్లో ప్రయాణిస్తుంటారు. ఎక్కువగా రాత్రిపూట ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే రాత్రిపూట ప్రమాదాలు జరిగితే సహాయ చర్యలు జరగడం కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుంటుంది.