Rahul Gandhi vs BJP: స్పీకర్‌నే లెక్కచేయరు.. రాహుల్‌గాంధీతో యూపీ మంత్రి వాగ్వాదం
- స్పీకర్‌నే లెక్కచేయరు.. నేనెందుకు మీ మాట వినాలి
- రాహుల్‌గాంధీతో యూపీ మంత్రి వాగ్వాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీతో యూపీ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ వాగ్వాదం పెట్టుకున్నారు. రాయ్‌బరేలీ నియోజకవర్గ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఈ ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Charlie Kirk: భర్త వారసత్వాన్ని కొనసాగిస్తా.. చార్లీ కిర్క్ భార్య ఎరికా భాగోద్వేగ ప్రసంగం
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
రాహుల్‌గాంధీ రెండు రోజుల పాటు సెప్టెంబర్ 10-11 తేదీల్లో సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో పర్యటించారు. ఇందులో భాగంగా యూపీ రాజధాని లక్నోలో రాయ్‌బరేలీలో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిషా) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, అమేథీ ఎంపీ కేఎల్. శర్మ, మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్, అధికారులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి తానే అధ్యక్షత వహిస్తానని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఏదైనా మాట్లాడాలంటే తనను అడగాలని సూచించారు. ఇంతలో మంత్రి దినేష్ జోక్యం చేసుకుని.. మీరు లోక్‌సభ స్పీకర్‌నే లెక్కచేయరు.. అలాంటప్పుడు మీరు చెప్పినట్లు మేము వినడమేంటి? అని ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో అమేథీ ఎంపీ శర్మ కలుగజేసుకుని రాహుల్‌గాంధీకి మద్దతుగా నిలిచి మంత్రిపై మండిపడ్డారు. దీంతో అక్కడున్న అధికారులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఇది కూడా చదవండి: SBI: ఎస్బీఐ బ్యాంకులో మరో మోసం.. నాణ్యత లేని బంగారం భద్రపరచి రూ. 23 లక్షలు తీసుకున్న వైనం
ఆశ్చర్యమేంటంటే దినేష్ ప్రతాప్ సింగ్ ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తే. 2022లోనే బీజేపీలో చేరారు. ప్రస్తుతం యూపీ మంత్రిగా ఉన్నారు. అయితే లోక్‌సభ స్పీకర్‌ను రాహుల్ గాంధీ పట్టించుకోనప్పుడు.. తానెందుకు రాహుల్ గాంధీ చెప్పినట్లుగా వినాలని మంత్రి ప్రతాప్ అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ సక్రమంగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉన్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు.
In the DISHA meeting, LoP Rahul Gandhi ji humbled down BJP minister Dinesh Pratap Singh.
The meeting, chaired by Rahul Gandhi ji was attended by MPs and MLAs from Amethi and Rae Bareli, including Singh. pic.twitter.com/tXzJSWovAg
— India With Congress (@UWCforYouth) September 12, 2025
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!