త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇంకోవైపు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌పై తీవ్ర కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది. మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించేలా ఈసీ ప్లాన్ చేస్తోంది. ఇ
నేపాల్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. అల్లర్లు, హింస తర్వాత పరిస్థితులు నెమ్మది.. నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్నాయి. సోమవారం ప్రజలు యథావిధిగా తమ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు.
భూప్రకంపనలు అంటే ఎవరైనా హడలెత్తిపోతారు. బతుకు జీవుడా అంటూ పరుగులు పెడతారు. ఏ ఒక్కరికైనా భయాందోళనలు సహజం. కానీ అస్సాంలోని నర్సులు మాత్రం వృత్తికి తగినట్టుగా తమ బాధ్యతలు నెరవేర్చి శెభాష్ అనిపించుకుంటున్నారు.
మహారాష్ట్ర గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో దేవవ్రత్ గవర్నర్‌గా ప్రమాణం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి ప్రమాణం చేయించారు.
ఆర్థిక రాజధాని ముంబైను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నగరం జలమయం అయింది. రహదారులు చెరువులను తలపించడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇక పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారు ఢీకొని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ కార్యదర్శి నవతోజ్ సింగ్ దుర్మరణం చెందారు. హరినగర్ నివాసి అయిన నవతోజ్ సింగ్ ఇంటికి వస్తుండగా బైక్‌ను కారు ఢీకొట్టింది.
టెక్సాస్‌లోని డల్లాస్‌లో భారతీయ సంతతికి చెందిన చంద్రమౌళి నాగమల్లయ్యను అత్యంత దారుణంగా క్యూబా జాతీయుడు హత్య చేశాడు. పరిగెత్తించి.. వెంటాడి భార్య, పిల్లల ఎదుటే నాగమల్లయ్యను శిరచ్ఛేదనం చేశాడు. అనంతరం తలను చెత్త బుట్టలో వేసి నిందితుడు పారిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
దేశంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌లో అనేక మంది మావోలను అంతమొందించారు. లొంగిపోండి.. లేదంటే జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఇప్పటికే మావోలకు కేంద్రం సూచించింది.