ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇకపై పాలస్తీనా దేశంగా ఉండబోదని ప్రతిజ్ఞ చేశారు. ఖతార్‌లో హమాస్ నాయకుల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి తర్వాత అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు.
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ (31) హత్య అమెరికాను కుదిపేసింది. ట్రంప్‌కు అత్యంత దగ్గర మనిషిగా పేరుగాంచిన చార్లీ కిర్క్ హత్యకు గురి కావడంతో అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అనంతపురంలో సూపర్ సిక్స్ సభ సూపర్ సక్సెస్ అయ్యిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తిరుపతిలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్‌తో కలిసి పులివర్తి నాని మాట్లాడారు. ‘‘సూపర్ సిక్స్ సభ విజయవంతం కావడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.
అనంతపురంలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ బాగా సక్సెస్ అయిందని మంత్రి పార్థపారధి అన్నారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘అనంతపురం సభకు ప్రజలు ఊహించని దాని కన్నా ఎక్కువ మంది వచ్చారని.. ఇది చూడలేకే జగన్ తన బాధ వెళ్లగక్కుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి రాజ్యమేలుతోందని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబు అన్నారు.
తిరుపతి జిల్లా గూడూరులో బుధవారం జరిగిన హత్య కేసులో పోలీసులకు కీలక పురోగతి లభించింది. ఈ కేసులో మరో లేడీ డాన్ వందన పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో హంతక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడిపై మాజీ టీటీడీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేదపారాయణదారుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పసిడి ప్రియులకు ఉపశమనం లభించింది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతుండడంతో గోల్డ్ లవర్స్ హడలెత్తిపోయారు. కొనాలంటేనే భయపడిపోయారు. తాజాగా ధరలకు బ్రేకులు పడ్డాయి.