ధైర్యం, ధైర్యసాహసాలకు మణిపూర్ నిలయం అని ప్రధాని మోడీ అన్నారు. రెండు జాతుల మధ్య జరిగిన హింస తర్వాత రెండేళ్లకు మణిపూర్‌లో ప్రధాని మోడీ అడుగుపెట్టారు. ఉదయం ఇంఫాల్‌కు చేరుకున్న ప్రధాని.. అక్కడ నుంచి రోడ్డుమార్గంంలో చరాచంద్‌పూర్ చేరుకున్నారు. అక్కడ నిర్వాసితులతో ముచ్చటించారు. చిన్నారులతో కాలక్షేపం చేశారు. అనంతరం జరిగిన సభలో మోడీ ప్రసగించారు. మణిపూర్ ప్రజల అభిరుచికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఇంత భారీ వర్షం కురుస్తున్నప్పటికీ మీరందరూ ఇక్కడికి వచ్చారని.. మీ ప్రేమకు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: PM Modi: 2 ఏళ్ల తర్వాత తొలిసారి మణిపూర్‌లో అడుగుపెట్టిన మోడీ
భారీ వర్షాల కారణంగా హెలికాప్టర్‌లో రాలేకపోయానని.. రోడ్డు మార్గంలో రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రోడ్డుపై చూసిన దృశ్యాల తర్వాత హెలికాప్టర్ పనిచేయకపోవడం పట్ల సర్వశక్తిమంతుడికి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. మణిపూర్ యువకులు, వృద్ధులు చేతుల్లో తిరంగను తీసుకెళ్తున్న తీరు జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని మోడీ తెలిపారు. ఇక నిర్వాసితులకు రూ. 500 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ప్రజలు సంఘర్షణ కంటే శాంతి, పురోగతిని కోరుకుంటున్నారని చెప్పారు. అభివృద్ధికి శాంతి అవసరంఅన్నారు. ఇక చురచంద్‌పూర్‌లో రూ.7,300 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. చురచంద్‌పూర్‌లో పట్టణ రోడ్లు, హైవేలు, మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్‌మెంట్ చొరవతో సహా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.
#WATCH | Churachandpur, Manipur: Prime Minister Narendra Modi says, "The land of Manipur is the land of courage and bravery… I want to salute the passion of the people of Manipur. All of you came here despite the heavy rain, I want to thank you for your love. Due to heavy… https://t.co/MTxpducUdO pic.twitter.com/I4bHB3alDq
— ANI (@ANI) September 13, 2025
#WATCH | Manipur: PM Modi being welcomed in Churachandpur as he arrives in the city. PM also interacts with the locals of the city.
PM will lay the foundation stone of multiple development projects worth over Rs 7,300 crore at Churachandpur today. The projects include Manipur… pic.twitter.com/wvDxi3P28i
— ANI (@ANI) September 13, 2025