విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాళ్ల దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది.. అయితే, రాత్రి సమయంలో రాళ్ల దాడి జరగడంతో ఈ కేసులు ఛేదించడంపై పోలీసులకు సవాల్‌గా మారింది.. అయినా వెనక్కి తగ్గకుండా.. కేసు దర్యాప్తు చేపట్టిన బెజవాడ పోలీసులు కీలక పురోగతి సాధించారు.. దాడికి పాల్పడిన వారిని, ఇక వారికి సహకరించిన వారిని కూడా ఈ రోజు అరెస్ట్ చూపించే అవకాశం ఉంది.. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు విజయవాడ పోలీసులు.
ప్రభుత్వ సలహాదారులకూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.. కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై కేబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీత భత్యాలు పొందుతున్న వారికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని పేర్కొంది..