Election Commission: డీబీటీ పథకాల అమలు.. సీఎస్‌కు ఈసీ కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో డీబీటీ పథకాల అమలుపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది.. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే బటన్ నొక్కి వివిధ పథకాలకు నిధులు విడుదల చేశారన్న ఎన్నికల కమిషన్.. రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లాల్సిన నిధులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేరలేదని పేర్కొంది.. లబ్ధిదారుల ఖాతాలకు నిధుల జమలో జరిగిన జాప్యంపై వివరణతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.. ఖాతాలకు నిధులను జమ చేయడంలో జరిగిన జాప్యంపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.. మొత్తం ఆరు పథకాలకు ఎప్పుడెప్పుడు బటన్ నొక్కారనే విషయమై జాబితాను లేఖలో ప్రస్తావించిన ఈసీ. మొత్తంగా ఆరు పథకాలకు సంబంధించి రూ. 14,165.66 కోట్లకు బటన్ నొక్కారని పేర్కొంది.. అయితే, ప్రచారం పూర్తైన తర్వాత పోలింగ్‌కు ముందు 11, 12వ తేదీల్లో నిధుల విడుదలయ్యేలా చూశారన్న సమాచారం తమకు ఉందని లేఖలో వెల్లడించింది ఈసీ.. పోలింగ్ కు ముందు లబ్ధిదారుల ఖాతాలకు నిధుల విడుదల చేయడం కోడ్ ఉల్లంఘనే అవుతుందని తెలిపింది.. అయితే, ఎన్నికల కోడ్ ముగిశాక లబ్ధిదారుల ఖాతాలకు నిధులు జమ చేయాలని ఆదేశించింది ఎన్నికల కమిషన్.
Read Also: Sivakarthikeyan : దళపతి విజయ్ మూవీలో శివకార్తికేయన్..?
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నిలకు సంబంధించిన పోలింగ్ ముగిసిన తర్వాతే.. సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని సూచించింది ఎన్నికల కమిషన్.. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులకు పోలింగ్ తేదీ తర్వాత నగదు జమ చేసుకోవచ్చని ఏపీ హైకోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా.. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.. వైఎస్సార్ ఆసరా, జగనన్న చేయూత లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా ఈసీ ఆదేశాలు ఇచ్చినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. అయితే దీనిపై స్పందించిన ఈసీ.. పోలింగ్ తేదీ తర్వాత నగదు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలని కోర్టుకు తెలిపిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!