Sitaram Yechury: 2024 ఎన్నికలు దేశ భవిష్యత్తులో కీలక పరిణామంగా ఉంటాయని తెలిపారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రణాళిక జరుగుతోందన్నారు. మేం ఇచ్చిన చాలా ఫిర్యాదులకు ఎకనాలెడ్జిమెంట్ కూడా లేదన్న ఆయన.. 42 శాతం గ్రాడ్యుయేట్లు మనదేశంలో నిరుద్యోగులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చే శారు.. జీడీపీ దారుణంగా పడిపోయింది.. పేదరికం పెరుగుతోంది.. వినాశకాలే విపరీత బుద్ధి అన్న రీతిగా ఉంది.. దేశంలోని ప్రతీదీ అదానీకి ఇచ్చాడు ప్రధాని మోడీ అంటూ మండిపడ్డారు.
Read Also: Akash anand: బీఎస్పీ రాజకీయ వారసుడిగా తొలగింపుపై ఆకాశ్ రియాక్షన్ ఇదే
సైనికులు అనే జైహింద్ కాస్తా జియో హింద్ అయిపోయిందని ఆరోపించారు ఏచూరి.. బ్లాక్ మనీ టెంపోలో వెళ్తుంటే.. ఈడీ ఏం చేస్తోంది..? అని నిలదీశారు. మతోన్మాద ఘర్షణలను రెచ్చగొట్టే వ్యాఖ్యానం ఎక్కువ జరుగుతోంది.. ఇండియలైన్స్ కాదు అండియలైన్స్ అని పిలవాలని ఎద్దేవా చేశారు. స్ధానిక పార్టీలతో పొత్తు పెట్టుకున్న చోట మాత్రమే బీజేపీ కొంత లాభపడే అవకాశాలున్నాయి.. స్ధానిక పార్టీల ఓట్లును బీజేపీ వినియోగించుకుంటుందని విమర్శించారు. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ ఎలక్టోరల్ బాండ్స్ కొనకపోతే ఈడీ, సీబీఐను ప్రయోగించారని ఆరోపించారు.. మనీలాండరింగ్ ను ఎలెక్టోరల్ బాండ్స్ పేరుతో కుంభకోణాలను లీగలైజ్ చేశారు మోడీ అని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్, బుల్డోజర్ పాలిటిక్స్ యూపీ, మణిపూర్ లలో చూశాం ఏం జరుగుతోందో? అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, రాజ్యాంగం మతం గురించి మాట్లాడదు.. వెనుకబడిన తనం ఎవరికైనా ఉండచ్చు.. కానీ కులం, మతంలో ఉండదని స్పష్టం చే శారు. ఇక, బీజేపీ ఎన్నికలను తనంతట తాను నెగ్గలేదు అని జోస్యం చెప్పారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.