CM YS Jagan: మోసాలతో యుద్ధం చేస్తున్నాం.. వాలంటీర్లు ఇంటికే రావాలన్న, పెద్దవాళ్ల బతుకు మరాలన్నా, వైద్యం, వ్యవసాయం మెరుగుపడాలన్నా.. ఫ్యాన్ గుర్తు ఉన్న రెండు బటన్లు నొక్కాలి.. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు గెలవాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేనిఫెస్టో ను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చేశాము.. 99 శాతం మేనిఫెస్టో అమలు చేశాం.. 59 నెలల కాలంలో 2 లక్షల 70 వేల కోట్లు అక్క, చెల్లెమ్మలు ఖాతాలకు పంపించాం అని తెలిపారు. వివక్ష, లంచాలకు తావు లేదు.. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ బోధన, ట్యాబ్‌లు, బైలింగువల్ టెక్స్ట్ పుస్తకాలు.. ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా చేశాం అన్నారు.. అమ్మ ఓడి, గోరుముద్ద, విద్య దీవెన, వసతి దీవెన.. గతంలో ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు.
Read Also: Crime: మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వాటర్ ప్యూరిఫైయర్ టెక్నీషియన్
అక్క చెల్లెమ్మలకు ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 21 లక్షల ఇల్లు.. గతంలో ఎపుడైనా జరిగాయా? అని ప్రశ్నించారు సీఎం వైఎస్ జగన్.. ఇక, రైతులకు పగటి పూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇచ్చాం.. వాహన మిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, జగనన్న తోడు.. గతంలో ఎపుడైనా ఉన్నాయా…? అని ప్రశ్నించారు.. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్, ఫామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష.. గతంలో ఎప్పుడైనా ఉందా..? అని సభికులను అడిగారు.. 600 సేవలు అందించే సచివాలయం, ఇంటి ముంగిటకే పౌర సేవలు, 3 వేల పెన్షన్.. గతంలో ఎప్పుడైనా ఉన్నాయా..? 14 ఏళ్లు 3 సార్లు సీఎం అని చెప్పే చంద్రబాబు చేసిన మేలు ఒక్కటైన గుర్తుకు వస్తుందా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.