AM Ratnam: పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపును ఎవరూ ఆపలేరు అనే ధీమా వ్యక్తం చేశారు జనసేన పార్టీ నేత ఏఎం రత్నం.. తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిఠాపురంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎంత పెద్ద మీటింగ్ పెట్టినా ప్రయోజనం ఉండదు అన్నారు.. పిఠాపురం ప్రజలు డబ్బులు ఇచ్చినా.. తీసుకోకుండా పవన్ కల్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని అంటున్నారని వెల్లడించారు. వైఎస్ జగన్ ఎంత పెద్ద సభలు పెట్టిన పిఠాపురంలో పవన్ గెలుపు ఎవరు ఆపలేరన్న ఆయన.. సినిమా పరిశ్రమను తొక్కాలని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నించిందిన విమర్శించారు.. అలాంటి వాటిని సినీ పరిశ్రమ వ్యతిరేకిస్తుందన్నారు ఏఎం రత్నం.
Read Also: Amit Shah: ఈ ఎన్నికలు జిహాద్ కు, అభివృద్ధికి మధ్య జరుగుతుంది.. అమిత్ షా హాట్ కామెంట్స్..
ఇక, తిరుపతి ఫేక్ ఐడీల ద్వారా దొంగ ఓట్లు వేస్తారని సమాచారం ఉందన్నారు జనసేన పార్టీ పరిశీలకుడు ఏఎం రత్నం.. దొంగ ఓట్లు వేసి జైలు పాలు కాకండి అని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లోను అవ్వకుండా.. ఓటు వేయండి అని పిలపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ జనసేన పార్టీ విజయం సాధిస్తుందన్నారు ఏఎం రత్నం.. కాగా, తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన నేత ఆరణి శ్రీనివాస్ బరిలోకి దిగిన విషయం విదితమే.