ఎట్టకేలకు 2 వేల రూపాయలు మార్పిడిలో టీటీడీ ప్రయత్నం ఫలించింది.. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి 2 వేల రూపాయల నోట్ల మార్పిడిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రద్దుచేసిన విషయం విదితమే కాగా.. అటు తరువాత కూడా శ్రీవారి హుండీలో 2 వేల రూపాయలు నోట్ల పెద్ద సంఖ్యలో సమర్పించారు భక్తులు.. దీనిపై రిజర్వ్ బ్యాంక్ అధికారులతో సంప్రదించి నోట్ల మార్పిడి చేయాలని విజ్ఞప్తి చేసింది టీటీడీ.. దీనిపై సానుకూలంగా స్పందించారు రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధులు..
చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారు.. ఏపీ నుంచి 25 ఎంపీలు మా కూటమికి వస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. ఏపీకి వచ్చిన ఆయన.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రముఖంగా చర్చించారు.. సీఎం వైఎస్ జగన్పై రాయి దాడి ఘటన సహా ఇతర అంశాలపై కూడా సుదీర్ఘ చర్చ సాగింది.