ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.. పెన్షన్ పంపిణీలో వృద్ధులకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డికి జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది ఎన్నికల కమిషన్.
గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ప్రచారం మరింత విస్తృతం చేసిన యార్లగడ్డ.. విజయవాడ రూరల్ ప్రసాదంపాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, గ్రామ సర్పంచ్ సర్నాల బాలాజీ ఆధ్వర్యంలో ప్రచారం హుషారుగా సాగింది.. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. 175 కి 175 అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మేం రెడీ అనే…
శుక్రవారం రోజు కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పర్వతనగర్, వివేకానంద నగర్, తులసినగర్, గాయత్రి నగర్, జనప్రియ నగర్లో మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేంధర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు.. నియోజకవర్గ ఇంఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
ఈ రోజు వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్. నవరత్న హామీలను కొనసాగించనున్నారు. అంతేకాదు.. డీబీటీ పథకాలకు సంబంధించి నగదు పెంపు హామీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు కొత్తగా పారిశ్రామీకరణ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ.