Funky Oversees Review : ఫంకీ ఓవర్సీస్ రివ్యూ.. విశ్వక్ ఖాతాలో మరొక ప్లాప్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ కామెడీ శైలిని సృష్టించుకున్న దర్శకుడు అనుదీప్ కేవీ. అయితే, ఆయన లేటెస్ట్ మూవీ ‘ఫంకీ‘. నేడు వరల్డ్ వైడ్ గా ఈ ఈసినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ ముగించుకున్న ఈ సినిమా ఎలా ఉందంటే ”అనుదీప్ స్టైల్ లో వన్-లైనర్ జోకులు బాగానే పనిచేశాయి. చాలా వరకు నవ్వులు తెప్పిస్తాయి. ఒక దశలో కామెడీ మరీ శృతిమించి ‘చిరాకు’ తెప్పించే స్థాయికి వెళ్ళిందనిపిస్తుంది. ఫస్టాఫ్ టిపికల్ అనుదీప్ స్టైల్ వన్-లైనర్స్ మీద ఆధారపడి సాగుతుంది. సెకండాఫ్ లోను అదే రొటీన్ స్టఫ్. కొంత మేర నవ్వించిన గొప్పగా అనిపించదు. మెకానికల్ కుటుంబ విలువలపై అనుదీప్ ట్రోలింగ్ బాగుంది, కానీ హీరో,హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ మెప్పించలేదు.
Also Read : Vijay – Rashmika : విజయ్-రష్మిక పెళ్లి హక్కుల కోసం ఓటీటీ సంస్థ భారీ ఆఫర్
Also Read
- కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
ఓవరాల్ గా చూస్తే మేకర్స్ చెప్పినట్టు సినిమాలో బలమైన కథ అంటూ ఏమీ లేదు. దర్శకుడి పాత సినిమాల మాదిరి ఈ సినిమా కూడా. కేవలం ప్రాసలు, సిల్లీ వన్-లైనర్లతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. కథ ఫిల్మ్ మేకింగ్ చుట్టూ ఉండే అడ్వాంటేజ్ తో దిల్ రాజు మరియు నాగ వంశీల సరదా అతిధి పాత్రలకు, దర్శకులు హరీష్ శంకర్, అనుదీప్, కళ్యాణ్ కృష్ణలు గెస్ట్ రోల్ లో కనిపించారు. ఈ సినిమాలో మేజర్ మైనస్ఎడిటింగ్. చాలా దారుణంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు ఒక ఫ్లో ఉన్న మూవీలా కాకుండా యూట్యూబ్‌లో కామెడీ క్లిప్స్‌ను ఒకదాని తర్వాత ఒకటి అతికించినట్లుగా అనిపిస్తుంది. ఇక డబ్బింగ్ విషయానికొస్తే.. అసలు సింక్ లేని వాయిస్‌లు ప్రేక్షకులకు అసహనం కలిగిస్తాయి. మాస్ కా దాస్ విష్వక్ సేన్ ఎనర్జీ గురించి అందరికీ తెలిసిందే. కానీ, ఈ తరహా సిల్లీ కామెడీ విష్వక్‌కు ఏమాత్రం సెట్ అవ్వలేదు. అతను క్యారెక్టర్‌లో ఇమడలేక ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది. అనుదీప్ రైటింగ్ చాలా రొటీన్ అయింది. అనుదీప్ ఇప్పటికీ జాతి రత్నాలు జోన్‌లో చిక్కుకున్నట్లు అనిపిస్తుందిమేకర్స్ చెప్పినట్టుగా కథ ఏమి లేకున్నా ‘ఫంకీ’ మిశ్రమ స్పందన రాబట్టింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!