మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా.. ఎనిమిది మంది యువకులు యానం వెళ్లారు.. ఆదివారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.. అర్ధరాత్రి వరకు యానాంలో ఫుల్లుగా మద్యం సేవించి.. ఆ తర్వాత ఆటోలో సొంత ఊరికి బయల్దేరారు.. అయితే, రాత్రి 12.30 గంటల సమయంలో అమలాపురం మండలం భట్నవిల్లిలో లారీని ఢీకొట్టింది ఆటో.. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు వదిలారు.
ఇవాళ చోడవరం, పి.గన్నవరం, పొన్నూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు సీఎం జగన్. ఈ రోజు ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం పార్లమెంట్ పరిధిలోని పి.గన్నవరం నియోజకవర్గంలో ఉన్న అంబాజీపేట బస్టాండ్ రోడ్డులో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్ జగన్.
ఏపీలో మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టో 2024ను విడుదల చేసిన ఆయన.. మూడు రాజధానులపై స్పష్టత ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖపట్నం రాజధానినిగా పరిపాలన సాగుతుందన్నారు. అంతేకాదు, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా.. విశాఖను అభివృద్ధి చేస్తాం అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో -2024ను విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, అమలు చేసిన విధానాన్ని వివరించిన ఆయన.. విపక్షాలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.. ఇక, 9 ముఖ్యమైన హామీలతో వైసీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు.. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలకు ఇళ్లు, నాడు-నేడు, మహిళా సాధికారిత, సామాజిక భద్రతతో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించారు.